/rtv/media/media_files/2025/05/23/i5DpEWPF3MpLH6M6TkhO.jpg)
తిరుమలలో ముగ్గురు పోలీసులు హల్ చల్ చేశారు. మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్‌రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. అంతేకాకుండా ఫుల్‌గా మద్యం తాగి భక్తులను కూడా ఇబ్బందులకు గురిచేశారు. మద్యం తాగిన పోలీసులను టీటీడీ విజిలెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించిన వారిపై కేసు నమోదు చేశారు. కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గుర్తించారు.
డ్రంక్ డ్రైవ్ టెస్ట్‌లో 300 పాయింట్లు
డ్రంక్ డ్రైవ్ టెస్ట్‌లో 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. మరోవైపు తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ దృశ్యాలు చూసిన భక్తులు షాక్‌కు గురయ్యారు. సీసీ కెమెరా ఉన్న ప్రాంతంలో ఓ వ్యక్తి నమాజ్ చేస్తుంటే టీటీడీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. నమాజ్ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు.
tirumala | Andhra Pradesh | ttd