నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త!

AP: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో అర్ధంతరంగా నిలిపేసిన 6,100 పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర పోలీసు సంక్షేమనిధికి ఏటా రూ.20 కోట్ల చొప్పున నిధులివ్వనున్నట్లు ప్రకటించారు.

chandrababu
New Update

Constable Jobs: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో అర్ధంతరంగా నిలిపేసిన 6,100 పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అలాగే రాష్ట్ర పోలీసు సంక్షేమనిధికి ఏటా రూ.20 కోట్ల చొప్పున నిధులివ్వనున్నట్లు ప్రకటించారు. 2014-19లో తాము అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ సంక్షేమానికి రూ.55 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పోలీస్ సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని చెప్పారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురికి నోటీసులు!

బకాయిలు చెల్లిస్తాం...

గత ప్రభుత్వం పోలీసుల సరెండర్‌ లీవులు, జీపీఎఫ్, టీఏ బిల్లులు తదితరాలకు పెట్టిన రూ.763 కోట్ల బకాయిలను వాయిదా పద్దతిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వైసీపీ హయాంలో నిలిచిపోయిన  6,100 పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. గత సీఎం జగన్‌ తన ఇంటి చుట్టూ ఇనుప కంచె వేయించుకోవటానికి ప్రజల సొమ్ము రూ.12 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. 

ఇది కూడా చదవండి: బ్లాక్‌లో టీటీడీ వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు!

కానీ రాష్ట్రంలో నేరనియంత్రణ, పరిశోధనలో కీలకమైన ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ వ్యవస్థ వార్షిక నిర్వహణకు ఐదేళ్లలో రూ.10 కోట్లు కూడా  ఇవ్వలేదని అన్నారు. సర్వేరాళ్లపై బొమ్మల కోసం రూ.700 కోట్లు తగలేసిన ఆయన.. రాష్ట్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.700 కోట్లు కేటాయించలేకపోయారని ధ్వజమెత్తారు. ఆ నిధులిచ్చి ఉంటే రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు చోటుచేసుకునేవి కాదన్నారు. రూ.500 కోట్లు వెచ్చించి రుషికొండపై ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌కు పోలీసులకు సరెండర్‌ లీవు బిల్లులు చెల్లించటానికి మాత్రం చేతులు రాలేదని అన్నారు. తమ ప్రభుత్వం పోలీస్ సంక్షేమంతో పాటు నేరాలు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు 

ఇది కూడా చదవండి:  ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe