AP Crime: విశాఖలో కలకలం.. ఆ నానమ్మ, మనవడిని చంపిందెవరు?

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలోని పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలో అటవీశాఖలోని క్వార్టర్‌లో విషాదం చోటుచేసుకుంది. నానమ్మ చిలకమ్మా,(55) మనవడు నాని(7)అనుమానాస్పద మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
AP Crime

AP Crime

AP Crime: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణంలోని పాత పోస్టాఫీస్‌ సమీపంలో అటవీశాఖకు చెందిన క్వార్టర్‌లో విషాదం చోటుచేసుకుంది. అటవీశాఖ క్వార్టర్స్‌లో సుమారు గత ఎనిమిది ఏళ్లకుపైగా డుంబురుగూడా మండలం సోవా గ్రామానికి చెందిన కొర్ర చిలకమ్మ కుటుంబం నివాసం ఉంటుంది.  స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం కూలి పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు భోజనాలు ముగించుకొని నిద్రకు ఉపక్రమించారు.

కుంపటి పొగ కారణమా.?

 ఒక గదిలో ఇతర కుటుంబ సభ్యులు నిద్రపోగా మరో గదిలో నానమ్మ చిలకమ్మ (55), మనవడు నాని(7) నిద్రపోయారు. ఉదయం కుటుంబ సభ్యులు నానమ్మ మనవడిని లేపేందుకు ప్రయత్నించగా వారు విగత జీవులై పడి ఉన్నారు. రాత్రి సంపూర్ణ ఆరోగ్యంతో నిద్రపోయిన నానమ్మ, మనవడు ఉదయాన్నే విగత జీవులై కనిపించడం కుటుంబ సభ్యులను విషాద వదనానికి గురిచేసింది. నానమ్మ, మనవడు మృతి చెందడానికి రాత్రి చలి నుంచి ఉపశమనం కోసం కుంపటి పెట్టుకోగా ఆ కుంపటి పొగతో ఊపిరాడక మృతి చెందారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

Also Reda: ఊబకాయం ఉన్నా పర్లేదు ఇలా చేస్తే గుండె సేఫ్‌

అయితే కేవలం పొగతోనే చనిపోతారా అని అనుమానాలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా నానమ్మ, మనవడు మృతిపై అరకులోయ పోలీసులకు కుటుంబ సభ్యులు స్థానికులు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి విచారణ వేగవంతం చేశారు. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపి ఇద్దరి మృతికి కారణాలను తెలుసుకుంటామని పోలీసులు అంటున్నారు.

Also Reda: చలికాలంలో ఇండోర్‌ మొక్కలని ఇలా రక్షించుకోండి



Advertisment
Advertisment
తాజా కథనాలు