నవంబరు రెండో వారంలో ఏపీ బడ్జెట్‌!

AP: రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను పెట్టింది. మరో రెండ్రోజుల్లో బడ్జెట్ తేదీలపై క్లారిటీ రానుంది.

chandrababu
New Update

AP Budget: రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను సమర్పించింది. కాగా మరో రెండ్రోజుల్లో దీనిపై బడ్జెట్ తేదీలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే అధికారులు ఆర్థిక బడ్జెట్ ను రెడీ చేసే పనిలో పడ్డారు.  ఆర్థిక వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు తేదీలు ప్రతిపాదనకు వచ్చినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: నిన్ను చంపేస్తాం.. సల్మాన్‌ఖాన్‌కు వార్నింగ్!

ఓటాన్ బడ్జెట్...

ఇటీవల ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  గత వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం రూ.2,86,389 కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. 2024 ఏప్రిల్‌ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు ఖర్చు చేశారు.  అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సాధించి జూన్‌ నెలలో అధికారంలోకి వచ్చింది. అయితే జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ సమర్పించాల్సి ఉండగా... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, ఎన్ని అప్పులున్నాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో.. పూర్తి వివరాలు రాబట్టి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. కాగా ఆ సమయంలో కూడా చంద్రబాబు సర్కార్  ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కాగా ఈ నవంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

హామీలకే ఎక్కువ కేటాయింపు...

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు గడుస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయకుందాం ప్రజలను మభ్య పెడుతుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రతిపక్షాలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం ఇవ్వద్దని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా అవసరమైన హామీలను వెంటనే ప్రారంబించాలను.. అందుకు తగ్గ బడ్జెట్ ను రూపొందించాలని ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టిన మాదిరే ఏపీలో కూడా సూపర్ సిక్స్ హామీలను ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు. కాగా ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి కీలక హామీలను డిసెంబర్ నెలలో అమలు చేయాలనే ఆలోచనలోం కూటమి సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బడ్జెట్ సమావేశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు!

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe