Central Funds: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.; తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు అందించింది. ఏపీ, తెలంగాణ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించింది. ఏపీకి రూ. 498కోట్లు, తెలంగాణకు రూ. 516 కోట్ల నిధులను విడుదల చేసింది. కాగా ఇటీవల రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను పలు మార్లు కలిసిన సంగతి తెలిసిందే. వరుస ఢిల్లీ పర్యటనల ఎఫెక్ట్ కేంద్రం నిధులు ఇచ్చేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ నష్టాల నుంచి ఆదుకునేందుకు కేంద్రం తెలుగు రాష్ట్రాలకు వరదం సాయం అందించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: గ్రూప్ -1 మెయిన్స్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఇటీవల వరద సాయం...
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లకల్లోలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ. 416.80, ఏపీకి రూ.1,036 కోట్లు NDRF నిధులు రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు అత్యధికంగా రూ.1,432 కోట్లు విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు, కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: మహా ఎన్నికలకు మోగనున్న నగారా!
పోలవరానికి కేంద్రం వరం...
ఇటీవల పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల శక్తి శాఖ తొలిసారిగా అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా కొన్ని షరతులను జోడించి ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు వరుస ఢిల్లీ పర్యటనలు సఫలం అయ్యాయనే చెప్పాలి. ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు నుంచి పలుమార్లు హస్తినకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఏపీ అభివృద్ధిపై, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, పోలవరం పూర్తి చేసేందుకు నిధులు వంటి ముఖ్యమైన అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలతో చర్చలు జరిపారు.
ఇది కూడా చదవండి: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి... ఆరోజే కీలక ప్రకటన!