/rtv/media/media_files/2025/02/21/PdBm4RCZrdlOVXmaVH8X.jpg)
Perni Nani Sensational Allegations
Perni Nani : వైసీపీ నేత పేర్ని నాని పై కేసు నమోదు అయింది. కృష్ణా జిల్లాలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని రెచ్చ్చగొట్టే వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు అయింది. కృష్ణ జిల్లాలో జరిగిన సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.. రప్పా రప్పా నరికేస్తాం అంటూ అరవడం కాదని, రాత్రికి రాత్రే అంతా జరిగి పోవాలని అన్నారు. ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వారిని రేపు తమ ప్రభుత్వం వచ్చాక వేసేయాలని, తరువాత ఏమీ తెలియనట్టు పరామర్శించాలని వ్యాఖ్యానించారు. కాగా నాని చేసిన ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేసారు. హింసను ప్రేరేపించే విధంగా నాని మాట్లాడారని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.