Swiggy: ఏపీలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి భారీ ఊరట లభించింది. ఈ నెల 14 నుంచి స్విగ్గీని బ్యాన్ చేయాలని నిర్ణయంపై హోటల్ యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో స్విగ్గీ యాజమాన్యం చర్చలు జరిపింది. హోటల్స్ అసోసియేషన్ షరతులకు స్విగ్గీ యాజమాన్యం సానుకూల స్పందించింది. దీంతో స్విగ్గీ బ్యాన్ నిర్ణయం వాయిదా వేసింది హోటల్ అసోసియేషన్.
ఎందుకు స్విగ్గీ బ్యాన్...
ఇటీవల ఏపీలో ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న స్విగ్గీ సేవలను బహిష్కరించాలని హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. తమకు నగదు చెల్లించకుండా స్విగ్గీ సంస్థ ఇబ్బందులకు గురి చేస్తుందని హోటల్, రెస్టారెంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఈ నెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్విగ్గీకి అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు హోటల్ యాజమాన్యాల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. కాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
జొమాటో ఒకే అంది..
ఫుడ్ డెలివరీ అందిస్తున్న జొమాటో, స్విగ్గీ సంస్థలు తమకు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు ఏపీలోని హోటల్ యజమానులు. తాము ఇచ్చిన ఫుడ్ కు డబ్బులను వారంలో లేదా మరోసటీ రోజే ఈ సంస్థలు ఇస్తాయని చెప్పారు. కాగా గత కొన్ని రోజుల నుంచి తమకు ఈ సంస్థలు చేసిన అమ్మకలకు సకాలంలో బిల్లులు చెల్లించక ఇబ్బందులు గురి చేస్తున్నాయని అన్నారు. అయితే ఈ రెండు సంస్థలతో పలు మార్లు చర్చలు జరపగా.. జొమాటో మాత్రమే తమ అభ్యంతరాలను అంగీకరించిందని హోటల్ అసోసియేషన్ పేర్కొంది. స్విగ్గీ మాత్రం తమ డిమాండ్లను పక్కకు పెట్టిందని.. అందుకే ఏపీ వ్యాప్తంగా స్విగ్గీ సేవలను నిలిపివేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.