AP TET Results: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ట్విటర్ ద్వారా టెట్ ఫలితాలను రిలీజ్ చేశారు. 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ టెట్ పరీక్షలను అక్టోబర్ 3 వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు ఆన్ లైన్ లో జరిగిన పరీక్షకు 4.7 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
Also Read: తెలంగాణలో ఈరోజు టెట్ నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పటినుంచంటే ?
మొత్తం 17 రోజుల పాటు రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కూడా ఉంటుంది. ఈ టెట్ స్కోర్‌కు లైఫ్‌లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు టెట్ ఫలితాలను https://aptet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే డీఎస్సీ నోటిఫికేషన్ ఈ నెల 6న విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
Also Read: అంతర్జాతీయ మధ్యవర్తిగా ఉద్భవిస్తున్న భారత్.. ఇవే ప్రధాన కారణాలు
తాజాగా విడుదలైన ఫలితాల్లో 1,87,256 మంది అంటే.. 50.79 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో 20 శాతం వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నవంబరు 6వ తేదీన డీఎస్సీ ప్రకటన విడుదల చేసేందకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
View Website
Also Read: చైతూ - శోభిత పెళ్లి వేదిక ఫిక్స్ చేసిన నాగార్జున.. ఎక్కడో తెలుసా?
ఈ నేపథ్యంలో న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే విభాగాల వారీగా ఖాళీలను కూడా ప్రకటించారు. అభ్యర్థులు డీఎస్సీ అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఎస్జీటీ తెలుగు మైనర్ మీడియా కి 160017 మంది పరీక్ష రాయగా వారిలో 104785 మంది పాస్ అయ్యారు. ఎస్జీటీ స్పెషల్ స్కూల్స్ కోసం 2173 మంది పరీక్ష రాయగా...767 మంది క్వాలిఫై అయ్యారు. ఎస్ ఏ లాంగ్వేజ్ పరీక్షకి 55781 మంది హాజరవ్వగా 22080 మంది ఉత్తీర్ణులయ్యారు. స్కూల్ అసిస్టెంట్స్ ఆల్ మీడియా పరీక్షకి 88290 మంది అంటెండ్ అవ్వగా 33525 మంది అర్హత సాధించారు. ఎస్‌ఏ సోషల్ పరీక్షకి 60442 మంది హాజరుకాగా...24472 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్ స్పెషల్ స్కూల్స్ కి 1958 మంది అంటెండ్ అవ్వగా 1627 మంది అర్హత సాధించారు.
అభ్యర్థులకు ఎటువంటి సందేహాలున్న 9398810958, 7995649286, 6281704160 నంబర్లకు కాల్ చేసి అడగవచ్చని అధికారుల తెలిపారు.