వైసీపీ మాజీ మంత్రికి బిగ్ షాక్.. అరెస్ట్‌కు రంగం సిద్ధం?

AP: కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకాణిపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరైన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

YS Jagan : గెలుపే లక్ష్యం.. ఆ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన జగన్!
New Update

Ex Minister Kakani: వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సోషల్ మీడియాలో  పోస్టింగ్‌లు పెట్టాడని ఆయనపై నాలుగు కేసులు నమోదు చేశారు పోలీసులు. వెంకటాచలం, ముత్తుకూరు, నెల్లూరు నాలుగో నగర పోలీసు స్టేషన్ లో కేసులు  నమోదు అయ్యాయి. FIRలో సెక్షన్ 191, సెక్షన్ 234 కింద పోలీసులు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడును గాడిద మీద ఊరేగించాలని అంటూ కాకాణి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. ఈరోజు స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు ముత్తుకూరు పోలీసులు. కాగా పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ నెలకొంది. కాకాణిని అరెస్ట్ చేస్తారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

ఇది కూడా చూడండి: పొలిటికల్ పవర్ లిస్ట్‌లో టాప్‌-5లో ఉన్న రాజకీయ నాయకులు వీళ్లే!

ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేపై..!

సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటోంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ పెద్దలపై, మహిళలు, అలాగే చిన్నారులపై అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. తాటిపర్తి  చంద్రశేఖర్ పై యర్రగొండపాలెంలో కేసు నమోదు అయింది. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్స్ లో పోస్ట్ చేయడంపై టీడీపీ నేతపోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కాగా ఒక ఎమ్మెల్యేపై కేసు నమోదు అవ్వడం ఇదే తొలిసారి.

ఇది కూడా చూడండి: 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe