మద్యం షాపులకు లాటరీ.. ఎన్నో చిత్ర విచిత్రాలు బాబోయ్, ఆశ్చర్యపోతారు!

రాష్ట్రంలో సోమవారం లాటరీ పద్దతి ప్రకారం మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ మద్యం షాపుల ప్రక్రియ అనంతరం చిత్ర విచిత్రాలు జరిగాయి. మద్యం షాపు దక్కిన వ్యక్తిని కిడ్నాప్ చేయడం, బడాబాబులకు కాదని మధ్యతరగతి వక్తిని వరించడం ఇలా చాలా జరిగాయి.

Liquor Shop
New Update

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం లాటరీ పద్దతి ప్రకారం మద్యం షాపుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వారు హ్యాపీగా సంబురాలు చేసుకుంటున్నారు. మరికొందరికి నోటికాడ కూడు తన్నేసినట్లు అయింది. ఈ లాటరీలో మద్యం షాపులు అనుకోకుండా కొందరిని వరించాయి. ఎలాగైనా పొందాలి అని గుంపులు గుంపులుగా ప్లాన్ చేసేవారికి రాకుండా అయిపోయాయి. ఇందులో చిత్ర విచిత్ర సంఘటనలు జరిగాయి. అవేంటో తెలుసుకుందాం. 

లాటరీ వరించిన వ్యక్తి కిడ్నాప్

ఇది కూడా చదవండి: RGV డెన్ లో 'యానిమల్' డైరెక్టర్.. ఏం ప్లాన్ చేస్తున్నారో?

హిందూపూర్ డివిజన్ సంబంధించిన లాటరీలో చిలమత్తూరులోని 57వ నెంబర్ దుకాణాన్ని రంగనాథ అనే వ్యక్తి గెలుచుకున్నాడు. లాటరీ ముగిసిన అనంతరం వ్యాపారి రంగనాథ లాటరీ వచ్చిన ఆనందంతో ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వచ్చాడు. వెంటనే గుర్తు తెలియని కొందరు వ్యాపారి రంగనాథను కిడ్నాప్‌ చేశారు. దీంతో ఈ వార్త జిల్లాలో తీవ్రకలకలం రేపింది. అనంతరం రంగనాథ భార్య అశ్విని పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్​ ఫిర్యాదు చేశారు. 

అనౌన్స్‌మెంట్‌లో తొందరపాటు.. అది 6 కాదు 9

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సర్కిల్ పరిధిలోని 42వ మద్యం షాపు విషయంలో కాస్త తొందరపాటు జరిగింది. డ్రాలో 9వ నెంబర్ వస్తే.. అధికారులు పొరపాటున 6 అని మైక్‌లో అనౌన్స్ చేశారు. దీంతో 6 నెంబర్ గల వ్యక్తి తెగ సంబరపడిపోయాడు. మళ్లీ క్రాస్ చెక్ చేయగా.. అది 9 అని తేలింది. దీంతో 6 నెంబర్ గల వ్యక్తి తీవ్ర నిరాశకు గురయ్యాడు. కావాలనే మార్చారని వాగ్వాదానికి దిగాడు. అధికారులు నచ్చజెప్పడంతో సైలెంట్ అయ్యాడు. 

ఇది కూడా చదవండి: మద్యం దుకాణం లాటరీ వచ్చిందనుకునే లోపే ...కిడ్నాప్‌ అయ్యాడు!

మహిళలకే ఎక్కువ

శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో మొత్తం 87 షాపులకు లాటరీ తీశారు. అందులో ఎక్కువ మొత్తంలో మహిళలే గెలుచుకున్నారు. ఏకంగా 60 మద్యం షాపులను మహిళలే పొందారు. 

పెట్రోల్‌ బంకులో పనిచేసే వ్యక్తికి అదృష్టం 

ఇది కూడా చదవండి: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు!

పెనుగంచిప్రోలులోని 80వ షాపు అనుకోని వ్యక్తిని వరించింది. బడా బడా బాబులు ఆ షాపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. పెట్రోల్ బంకులో పనిచేసే ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన నలమోలు రామకృష్ణను వరించింది. రూ.2 లక్షలు కట్టి దరఖాస్తు చేసుకోగా.. రామకృష్ణకు అదృష్టం దక్కింది. 

మధ్యప్రదేశ్‌/ ఒడిశా వ్యక్తులకు జాక్‌పాట్

ఈ మద్యం షాపు లాటరీ తెలుగు రాష్ట్రాల వారికే కాకుండా ఇతర రాష్ట్రాల వారిని వరించింది. మధ్యప్రదేశ్‌ ఇండోర్ నగరంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్ జిల్లాలోని షాపుల కోసం అప్లై చేసుకున్నారు. వారిద్దరికీ విజయవాడలోని రెండు షాపులు లాటరీలో దక్కాయి. అలాగే ఒడిశా మద్యం వ్యాపారులు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో రెండేసి షాపులు దక్కించుకున్నారు. 

ఇది కూడా చదవండి: కెన్యాలో పంచాయితీ పెట్టిన అదానీ.. అసలేమైందంటే?

రింగ్ అయి దక్కించుకున్నారు..

మద్యం దుకాణాలు సొంతం చేసుకునేందుకు చాలా మంది సిండికేట్‌ అయ్యారు. ఇందులో బాగంగానే భారీగా అప్లై చేసుకున్నారు. అయితే విజయవాడ నగరంలో ఓ నియోజకవర్గంలోని డివిజన్‌ స్థాయి ప్రజాప్రతినిధి కొందరిని కలిపి రింగ్‌ చేశాడు. వీరంతా 154 షాపులకు దరఖాస్తు చేసుకోగా ఐదు మాత్రమే వరించాయి. మరో నియోజకవర్గంలో కూడా కొందరితో గ్రూప్ కట్టి 250 షాపులకు అప్లై చేయగా ఇక్కడ కూడా 5 దుకాణాలే దక్కాయి. మరో గ్రూప్ 300 పైగా షాపులకు దరఖాస్తు చేస్తే 5 దక్కాయి. 

#liquor-shop #AP Liquor Shops Lottery #AP Liquor Shops Lottery News
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe