ఇకపై భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానం

ఏపీ ప్రభుత్వం అన్ని భవన నిర్మాణ అనుమతులకు ఇకపై సింగిల్ విండో విధానాన్ని తీసుకురానుంది. ఒకే పోర్టల్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు వచ్చేలా ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది 2025 నుంచి ఈ కొత్త విధానం అమలుల్లోకి వచ్చే అవకాశం ఉంది. 

New Update
contrsuction

భవన నిర్మాణ అనుమతులకు ఏపీ ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని తీసుకురానుంది. ఇకపై ఒక పోర్టల్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు వచ్చేలా ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది 2025 నుంచి ఈ కొత్త విధానం అమలుల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ శాఖల మంత్రులు సమావేశమయ్యారు. మరోసారి ఈ నెల ఆఖరులో సమావేశం కానున్నారు. ఈ సింగిల్ విండో విధానం వల్ల అనుమతుల్లో అడ్డంకులు, అక్రమ వసూళ్లను నిరోధించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఎక్కడైనా భవనాలు నిర్మించాలంటే.. గతంలో క్షేత్రస్థాయి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అధికారులు ఫీజుల కంటే లంచాలే ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని తీసుకురానుంది. 

అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే పోర్టల్

ఇప్పటివరకు ప్రజలు ఏదైనా కొత్త నిర్మాణం చేపట్టాలంటే డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా అనుమతి కలిగి ఉంటే స్థానిక సంస్థలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారు. ఇలా అప్లై చేసిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల్లో ప్రీ పర్మిషన్ వస్తుంది. ఫీజులు చెల్లించిన తర్వాత పోస్ట్ వెరిఫికేషన్ ప్రారంభం అవుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుదారులు పెట్టిన దస్త్రాలు సరైనవా? లేదా? అని పరిశీలిస్తారు. ఏవైనా లోపాలుంటే నిర్మాణ పనులను నిలిపివేస్తారు. అదే కొత్త విధానంలో అయితే డీపీఎంఎస్ పోర్టల్‌కు ముఖ్యమైన ఇతర ప్రభుత్వ శాఖలను అనుసంధానిస్తున్నారు. అనుమతుల కోసం దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలకు కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ రోజులు పెండింగ్‌లో పెట్టుకోకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు