Ap: ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్..వారికి ఇక నుంచి నెలకు 10 వేలు!

ఏపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మార్చిన సంగతి తెలిసిందే. లాయర్లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది.

New Update
CHANDRABABU

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారం చేపట్టినప్పటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఓ పథకానికి పేరు మార్చగా.. తాజాగా దానిని అమలు చేసే దిశగా ఓ అడుగు ముందుకు వేసింది. ఏపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ లా నేస్తం పథకం పేరును న్యాయమిత్రగా మార్చింది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు త్వరలో జారీ చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే తాజాగా చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో జూనియర్‌ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేందుకు స్టైఫండ్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అందుకు గానూ లాయర్లకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ మేరకు ఆ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఇదే విషయాన్ని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించామని.. అలాగే జూనియర్‌ న్యాయవాదుల శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటుకు కసరత్తు చేయాలని కూడా అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం ద్వారా లా చదివి.. న్యాయ‌వాద వృత్తిలోకి  అడుగుపెట్టిన న్యాయ‌వాదుల‌కు ప్ర‌తి నెలా రూ. 5,000 స్టైఫండ్ ఇచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నెలకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించింది.

వారు న్యాయవాద వృత్తిని నిలదొక్కుకునేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు