Shekhar Basha :  శేఖర్ బాషాపై మరో కేసు...నమ్మించి మోసం చేశాడని...

బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ బాషాపై  వరుసగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో వేధింపుల వ్యవహారం వెలుగు చూసింది. శేఖర్‌ బాషా తనను మోసం చేశాడంటూ ఓ యువతి మీడియా ముందుకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై సాయం చేస్తానని నమ్మించి మోసం చేశాడని వెల్లడించింది.

New Update
RJ Shekhar Basha

RJ Shekhar Basha

Shekhar Basha:  బిగ్‌బాస్ ఫేమ్, ఆర్జే శేఖర్ బాషాపై  వరుసగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆర్జే శేఖర్‌ బాషా తనను మోసం చేశాడంటూ ఓ యువతి మీడియా ముందుకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయంపై సాయం చేస్తానని నమ్మించి మోసం చేయడమే కాకుండా తనను వేధించాడని ఆ యువతి ఆరోపించింది.  

Also Read :  ఇది చారిత్రాత్మకమైన తీర్పు.. ఢిల్లీ రిజల్ట్స్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!

  చిత్తూరు జిల్లా తిరుపతి కి చెందిన ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్‌తో పాటు శేఖర్ బాషా తనను మోసం చేశారని బాధితురాలు లక్ష్మీ ఆరోపించింది. బాధితురాలు లక్ష్మీ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ .. గతంలో ఓ అబ్బాయి పై ఫిర్యాదు చేయటానికి వెళ్తే ఎస్పీ శ్రీనివాస్ తనను ట్రాప్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. తనను మానసికంగా వేధించి తనపై లైంగిక దాడి కూడా చేశారని ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను తన ఫ్యామిలీని చంపేస్తానని ఎస్పీ శ్రీనివాస్ బెదిరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఎస్పీపై కేసు పెట్టానన్నారు.

Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలకు మిగిలింది రెండు ముహూర్తాలే..ఎప్పుడంటే

ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌ ఫేమ్ శేఖర్ బాషా తనకు ఓ ఈవెంట్‌లో పరిచయం అయినట్లు ఆ యువతి తెలిపింది. దీంతో తమ మధ్య స్నేహం పెరిగిందని వివరించింది. దాంతో ఎస్పీ విషయం ఆయనకు చెప్పానని ఎస్పీపై పెట్టిన కేసు విషయం శేఖర్ బాషాకు చెపితే హెల్ప్ చేస్తానని మోసం చేశాడని వివరించింది. శేఖర్ బాషా, ఎస్పీ శ్రీనివాస్‌ తో చేతులు కలిపి తనను హింసిస్తున్నారని బాధితురాలు వాపోయింది.

   ఇది కూడా చదవండి: MASTHAN SAI: మస్తాన్ సాయికి మరో షాక్.. కోర్టు కీలక ఆదేశాలు!


శేఖర్ బాషా వల్ల గతంలో ఓ అమ్మాయి మృతి చెందిందని కూడా ఆ యువతి వివరించింది. కాగా శేఖర్‌ భాషా ఎస్పీతో తను ఉన్న కొన్ని ప్రైవేటు వీడియోలను యూట్యూబ్ ఛాన్సల్‌లో పెట్టి వేధిస్తున్నాడని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్పీ శ్రీనివాస్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. ఎస్పీ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలని కోరారు. కాగా ఈ విషయం శ్రీనివాస్ భార్యకు చెప్తే ఆమె కూడా తన భర్తకు భర్తకు సపోర్ట్ చేస్తోందన్నారు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని తనకు న్యాయం కావాలని బాధితురాలు డిమాండ్ చేసింది. ఇదే సందర్భంలో ఎస్పీ శ్రీనివాస్‌, శేఖర్ బాషాకు సంబంధించిన పలు వీడియోలుసోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  దీంతో ఈ కేసు ఎటు దారి తీస్తుందోననే పలువురు చర్చించుకుంటున్నారు.

Also Read: పేరెంట్స్ సె**క్స్ పై ప్రశ్న దుమారం.. క్షమాపణ చెప్పిన యూట్యూబర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు