AP MURDER: ఏపీలో ఘోరమైన మర్డర్.. వివాహేతర సంబంధం - కత్తులతో పొడిచి యువకుడి హత్య

ఏపీలో మరో ఘోరమైన మర్డర్ జరిగింది. శ్రీసత్య సాయి జిల్లా కదిరి మండలం బండవాండ్లపల్లికి చెందిన నవీన్ (35) గ్రామ శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
andhra pradesh sri sathya sai district young man brutally murdered

andhra pradesh sri sathya sai district young man brutally murdered

ఏపీలో మరో ఘోరమైన మర్డర్ జరిగింది. కొందరు దుండగులు 35 ఏళ్ల యువకుడిని తెల్లవారుజామున కత్తులతో పొడిచి పొడిచి హతమార్చారు. అక్రమ సంబంధమే ఈ మర్డర్‌కు ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ALSO READ: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

కత్తులతో పొడిచి పొడిచి

శ్రీసత్య సాయి జిల్లా కదిరి మండలం బండవాండ్లపల్లికి చెందిన నవీన్ (35)కు గతంలో పెళ్లైంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అనివార్య కారణాల వల్ల నవీన్ భార్య రెండు సంవత్సరాల కిందట ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి తండ్రి నవీన్ తన పిల్లలను చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నవీన్‌ వేకువజామున బహిర్భూమికి వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని గ్రామ శివారులో కత్తులతో దారుణంగా పొడిచి పొడిచి హత్య చేశారు. 

ఒకవైపు తల్లి రెండు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు తండ్రి హత్యకు గురికావడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. అయితే ఈ మర్డర్‌ గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు