YS Jagan : జగన్ తో సెల్ఫీ దిగిన కానిస్టేబుల్ కు షాక్!

గుంటూరు జైలు వద్ద మాజీ సీఎం జగన్ తో యూనిఫామ్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సెల్ఫీ దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఆ కానిస్టేబుల్ కు ఛార్జిమెమో ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.

New Update
YS Jagan Selfie

YS Jagan : 

టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ ఇటీవల గుంటూరు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. జైలులో నందిగం సురేష్ తో ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడారు. అయితే.. ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ జగన్ తో సెల్ఫీ దిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూనిఫాంలో ఉంటూ సెల్ఫీ దిగడంపై విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి. 

ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ కానిస్టేబుల్ పై వారు సీరియస్ అయ్యారు. ఆ కానిస్టేబుల్ కు ఛార్జ్ మెమో ఇచ్చేందుకు జైలు అధికారులు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. కుమార్తెతో కలిసి సెల్ఫీ దిగిన జైలు కానిస్టేబుల్ ఆయేషాబాను తీరుపై అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని అధికారులు చెబుతున్నారు. వివరణ ఇచ్చిన తర్వాత కానిస్టేబుల్ ఆయేషాబానుపై చర్యలుంటాయని జైలర్ రవిబాబు చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు