AP Crime: ఏప్రిల్ లో మిస్సింగ్‌..సెప్టెంబర్‌ లో ఆత్మహత్య..!

క్రికెట్‌ బుకీలు వేధింపుల, ఆర్థిక నష్టాల వల్ల ఏలూరు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ, వినోద్‌ అనే అన్నదమ్ములు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గత ఏప్రిల్‌ నుంచి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే వారణాసిలో ఓ ఆశ్రమంలో ఉరేసుకుని చనిపోయారు.

New Update
ap two brothers

 

Andhra Pradesh Crime:  ఏపీకి చెందిన ఇద్దరు యువకులు వారణాసిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా నారాయణపురానికి చెందిన అన్నదమ్ములు లక్ష్మీనారాయణ, వినోద్ ఏప్రిల్‌లో ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వీరు మే 12న తాము ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు  సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసి మిత్రులకు, బంధువులకు కుటుంబ సభ్యులకు పంపించారు. అప్పటి నుంచి లక్ష్మీనారాయణ, వినోద్ కోసం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఈ క్రమంలోనే రాజేష్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వారణాసి ప్రాంతంలోని భేల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో.. మానసరోవర్‌ ప్రాంతంలో ఉన్న రామ్‌తారక్‌ ఆంధ్రా ఆశ్రమంలో వీరు ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండడంతో  ఆశ్రమం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గది తలుపులు తీయగా.. ఇద్దరు ఉరి వేసుకుని కనిపించారు. 

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. ఏపీలోని కుటుంబ సభ్యులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు. లక్ష్మీనారాయణ, వినోద్ ఆగస్టు 28 నుంచి ఆశ్రమంలోని ఉన్నారని, తీర్థయాత్రల కోసం వచ్చినట్లు చెప్పారని ఆశ్రమం నిర్వాహకులు తెలిపారు. 


రెండు రోజుల క్రితమే...

వీరు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెబుతున్నారు. అన్నదమ్ముల ఆత్మహత్యకు సంబంధించి ఓ సెల్ఫీ వీడియో కూడా బయటపడింది.క్రికెట్ బుకీ వేధింపుల వల్లే  ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. కొందరు వ్యక్తుల కారణంగా తాము ఆత్మహత్యకు పాల్పడ్డామంటూ వారి పేర్లతో సహా వీడియోలో చెప్పారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల నుంచి సమాచారం అందడంతో.. మృతదేహాలను తీసుకొచ్చేందుకు బంధువులు వారణాసికి బయల్దేరారు. 

రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం

అంతేకాదు అన్నదమ్ములిద్దరు కొంత కాలం క్రితం వరకు రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేసేవారని.. ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు వ్యక్తులు వారిని బెదిరిస్తున్నట్లు కుటుంబ సభ్యుల దగ్గర చెప్పారనే ప్రచారం కూడా జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసును ఏపీకి బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పాటుగా కొందరిపై వీరు ఆరోపణలు చేయడంతో.. వారణాసి నుంచి చేబ్రోలు పోలీసులకు కేసును బదిలీ చేసే అవకాశం కనపడుతుంది.

Also Read: కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి మరో కీల‌క ప‌ద‌వి

Advertisment
తాజా కథనాలు