JC Prabhakar Reddy: పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ!
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు పై మండిపడ్డారు. కేవలం అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల కోసమే పోలీసులు పని చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు పై మండిపడ్డారు. కేవలం అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల కోసమే పోలీసులు పని చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా గార్ల దిన్నె లో సినిమా డ్రామాని తలపించే విధంగా ఓ దొంగతనం జరిగింది. పోలీసులమని చెప్పి కారులో ఉన్న సుమారు 2 కోట్ల రూపాయలను దుండగులు ఎత్తుకుపోయారు.
అనంతపురంలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో గత వారం రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా దీనిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఈ వ్యవహారంపై జేసీకి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఆపాలని తాను ఎక్కడా అనడం లేదన్నారు.
హిందూపురంలోని చలివెందుల గ్రామపంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ-టీడీపీ పోటాపోటీగా ప్రచారాలు చేశాయి. చలివెందుల, రాచపల్లి, మీనకుంటపల్లి గ్రామాలలో అత్యధిక ఓట్లు బీసీ, ఎస్సీ వర్గాలు ఉన్నందున.. సర్పంచ్ ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.
ఓ వైపు చిరుతలు.. మరోవైపు ఎలుగుబంటి హల్ చల్.. కొండపైకి వెళ్లాలంటేనే ప్రాణాలకు తెగించి వెళ్లాలి. లేదంటే ప్రాణాలు వన్య మృగాల చేతిలో బలి అవ్వాల్సిందే.. దేవుని దర్శనం కావాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే అంటున్నారు భక్తులు. . ఇది తిరుమలలో కొనసాగుతున్న పరిస్థితి.
అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ భాను ప్రకాష్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు లైబ్రెరియన్ పట్టుకొని చితకబాదారు.
పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్కు తల్లిదండ్రులకు దేహశుద్ది చేశారు. పిల్లలను లోదుస్తుల కలర్ గురించి ఆడుగుతూ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారని టైబ్రేరియన్పై ఆరోపణ చేశారు. ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు లైబ్రేరియన్ను చితకబాదిన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. దిగుబడి పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి. మదనపల్లె మార్కెట్ లో గత నాలుగైదు రోజులుగా టమాటా రేట్లు తగ్గుతున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం ఉబ్బెంగికి చెందిన బసంతి అనే మహిళకి పురిటి నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు డోలీలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు. వాళ్ల గ్రామం నుంచి అల్లూరి జిల్లాకు వెళ్లాలంటే 5 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈక్రమంలో పురిటి నొప్పులు మరికాస్త ఎక్కువై.. మహిళ దారిలోనే మరణించింది.