నలంద కాలేజీలో ఘోరం.. ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకిన విద్యార్థిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలోని నలంద కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. ఈ కళాశాలలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సుధ అనే యువతి బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. ఆమె ఆత్మహత్యకు, కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని ప్రిన్సిపల్ చెప్పినా పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.