YSRCP Manifesto: ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన?
రాప్తాడులో ఇవాళ వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో జగన్ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ మేనిఫెస్టోని ప్రకటిస్తారని సమాచారం. రైతులకు లక్ష వరకు రుణమాఫితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.