BREAKING: TDP ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన Jr. NTR ఫ్యాన్స్

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ఇంటిని ఆదివారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడికి యత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని ఎన్టీఆర్ అభిమాన సంఘాలు పిలుపునిచ్చాయి. MLA ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

New Update
TDP MLA house

TDP MLA house

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ ఆడియో లీక్ అవ్వడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ఆడియోలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పైనా, ఆయన తల్లి శాలినీపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ఇంటిని ఆదివారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడికి యత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని ఎన్టీఆర్ అభిమాన సంఘాలు పిలుపునిచ్చాయి. MLA ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్‌ అభిమానులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఎన్టీఆర్‌కు, ఆయన తల్లికి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్  డిమాండ్ చేస్తున్నారు.

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటిని ముట్టడించడానికి ఎన్టీఆర్ అభిమానులు చలో అనంతపురం కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్యే ఇంటి దగ్గర, పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు బారికేడ్లు పెట్టి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లే మార్గాలను మూసివేశారు. అనంతపురం వైపు వస్తున్న అభిమానులను పోలీసులు పామిడి వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎన్టీఆర్ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు పలువురు అభిమానులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ వివాదంపై ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటన టీడీపీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారింది. ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీలో అంతర్గత విభేదాలు, అనవసర వివాదాలు సహించబోమని ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు సమాచారం. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ అభిమానుల నిరసనలపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

Advertisment
తాజా కథనాలు