BIG BREAKING: చంద్రబాబుకు కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఎందుకో తెలుసా?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారు.

New Update
Arvind Kejriwal Chandrababu

అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దూమారం రేగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందనేంటో తెలియజేయాలని లేఖలో కోరారు. బాబా సాహెబ్‌ను అమిత్ షా అవమానించారని తన లేఖలో కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: చెల్లెమ్మకు చెక్.. షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ సంచలన వ్యూహం!

లోతుగా ఆలోచించాలని విజ్ఞప్తి..

అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. ప్రతిపక్షాలు ఇంతలా ఆందోళనలు చేస్తున్నా.. అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సమర్థిస్తున్నారని ఫైర్ అయ్యారు. మీరు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రజలు ఆశిస్తున్నారని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై టీడీపీ వర్గాలు, చంద్రబాబు ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 
ఇది కూడా చదవండి: నాగబాబుకు షాకిచ్చిన పవన్.. మంత్రి పదవికి ఊహించని బ్రేక్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు