ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్‌కు మూడు రోజుల ఏసీబీ కస్టడీ

AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డికి మూడు రోజల కస్టడీ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. వెంకటరెడ్డి చర్యల వల్ల రూ. 2,566 కోట్ల వరకు ప్ర‌భుత్వ‌ ఆదాయానికి గండి పడిందని గుర్తించిన ఏసీబీ అధికారులు.. ఇటీవల అతన్ని అరెస్ట్ చేశారు.

Venkata Reddy
New Update

Venkata Reddy: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. వెంకటరెడ్డిని ఏడు రోజుల కస్టడీ ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి ఏసీబీ అధికారులు అడిగిన ఏడు రోజుల కస్టడీకి ఒప్పుకోలేదు. రేపటి నుంచి మూడు రోజుల పాటు వెంకటరెడ్డిని ఏసీబీ అధికారుల కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. కాగా వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. 

ప్రభుత్వ ఖజానాకు రూ.2 వేల కోట్లు లాస్..

ఇటీవల ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వెంకట రెడ్డి చర్యలు వల్ల ప్రభుత్వానికి 2 వేల 566 కోట్ల రూపాయలు మేర ఆదాయానికి గండి పండిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. గ‌నుల శాఖ‌లో టెండ‌ర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధ‌న‌లు, ఇసుక త‌వ్వ‌కాల్లో భారీ మొత్తంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌నే అభియోగాల‌పై కొన్నాళ్ల కింద‌ట రాష్ట్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను స‌స్పెండ్ చేసింది. ఆ నోటీసులు ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించగా వెంకట రెడ్డి అప్పటి నుంచి కనిపించకుండా తిరుగుతున్నారు. దీంతో ఆయ‌న‌పై ఈ నెల 11న ఏసీబీ అధికారులు కేసు న‌మోదు చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న కోసం వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న‌ ఏసీబీ అధికారులు ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్‌ లో ఆయనని ఇటీవల పట్టుకున్నారు.

ఇక వెంక‌ట రెడ్డి గత వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో  చేసిన చర్యల వల్ల రూ. 2,566 కోట్ల వరకు ప్ర‌భుత్వ‌ ఆదాయానికి గండి పడిందని ఏసీబీ అధికారులు తెలుసుకున్నారు. ఇసుక గుత్తేదారు సంస్థ‌లైన జీసీకేసీ, ప్ర‌తిమ సంస్థలు,  జ‌య‌ప్ర‌కాశ్ ప‌వ‌ర్ వెంచ‌ర్స్ లిమిటెడ్, మ‌రికొంద‌రు వ్య‌క్తుల‌తో క‌లిసి రూ. వేల కోట్లు కొల్ల‌గొట్టేందుకు ఆయ‌న కుట్రలకు పాల్ప‌డ్డార‌ని ఏసీబీ వివరించింది.

Also Read:  బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్స్ హంగామా షురూ.. ఫస్ట్ వచ్చేది ఎవరంటే?

#ap-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe