Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 6 గురు మృతి అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ కారును అమాంతంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దాదాపు 6 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. By Seetha Ram 26 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. ఊహించని సంఘటనలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీటికి ప్రధాన కారణం అతి వేగం అని పోలీసులు చెబుతున్నారు. దీని కారణంగానే పోలీసులు ఎన్నో కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్‌న్ డ్రైవ్, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్ స్పాట్‌లోనే ఆరుగురు మృతి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నార్పలలో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఓ కారు టైరు పగిలి అదుపుతప్పింది. అదే సమయంలో అటువైపుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఇక ఆ కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం - కడప హైవేపై ఈ ప్రమాదం జరిగింది. కాగా మరణించిన వారంతా అనంతపురానికి చెందిన సంతోష్, షణ్ముక్, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీగా గుర్తించారు. ఈ ఆరుగురు కలిసి తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు! ఇలాంటి ఘటనే మరొకటి కాగా ఇలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది. కర్నూలు జిల్లాలో గుండెలను పిండేసిన ఘటన చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో రాజోలిలో శివ అనే యువకుడు భార్య లక్ష్మితో కలిసి ఉంటున్నారు. అయితే పెళ్లయిన కొన్ని నెలలకు గర్భం దాల్చగా డెలివరీ కోసం ఆమె పుట్టింటికి వెళ్లింది. అయితే శివ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రాజోలిలో ఎస్పీ కాలనీ వద్ద అదుపు తప్పి పడిపోయాడు. శివకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే కర్నూలు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. కానీ లక్ష్మీకి మాత్రం చిన్న గాయాలు అయ్యాయని, ఎలాంటి ప్రమాదం లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్! ఇంతలో లక్ష్మీకి పురిటి నొప్పులు రావడంతో డెలివరీ కోసం ఆమెను కూడా అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంతలో శివ పరిస్థితి విషమించడంతో మరణించాడు. లక్ష్మీ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆమెతో చెప్పలేదు. శివ చనిపోయిన గంట తర్వాత వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం! ఆమె డెలివరీ అయిన తర్వాత భర్త చనిపోయాడన్న విషయాన్ని తెలియజేశారు. భర్త మరణించాడని బాధపడాలో లేకపోతే కొడుకు పుట్టాడని సంతోష పడాలో ఆ కుటుంబ సభ్యులకు తెలియలేదు. పుట్టిన బిడ్డను చూసే అదృష్టం తండ్రికి లేదని, తండ్రిని చూసే అదృష్టం బిడ్డకు లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామం విషాదంలోకి మునిగిపోయింది. #ap-road-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి