Andhra Pradesh: టీడీపీలో 14 సిట్టింగ్స్ కన్ఫామ్.. వీరికి మాత్రం డౌటే..!

తెలుగుదేశం పార్టీ తన సిట్టింగ్ స్థానాల్లో 5 స్థానాలను జనసేన పార్టీకి కేటాయించాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే 14 టికెట్లను సిట్టింగులకే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. బీజేపీతో పొత్తు కన్ఫామ్ అయితే ఆ పార్టీకి విశాఖ నార్త్ ఇవ్వాలని నిర్ణయించింది టీడీపీ.

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం... రాష్ట్ర అధ్యక్షుడి మార్పు!
New Update

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీలు, పార్టీల నాయకులు స్పీడ్ పెంచారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక, పొత్తులు వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఈసారి ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్న టీడీపీ.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. వైసీపీని గద్దె దించే లక్ష్యంతో ఇప్పటికే జనసేనతో చేతులు కలిపింది టీడీపీ. పొత్తులో భాగంగానే.. సీట్ల కేటాయింపులు, పంపకాలపై సమాలోచనలు జరుపుతోంది టీడీపీ అధినాయకత్వం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 23 టీడీపీ సిట్టింగ్ స్థానాల్లో 5 సీట్లను మిత్రపక్షం జనసేనకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 14 మంది సిట్టింగులకు టికెట్లు ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే, విశాఖపట్టణం సౌత్‌ టికెట్‌ జనసేనకు కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. విశాఖపట్టణం నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. ఒకవేళ బీజేపీతో పొత్తు ఖరారైతే ఆ స్థానాన్ని బీజేపీకి ఇస్తారంటూ పొలిటికల్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏ టికెట్ ఎవరికంటే..

సిట్టింగ్‌లకు ఇచ్చే స్థానాలు - 17

సిట్టింగ్ స్థానాల్లో జనసేనకు ఇచ్చే ఛాన్స్ - 5

శ్రీకాకుళం..

ఇచ్చాపురం: బెందాళం అశోక్

టెక్కలి: కింజరపు అచ్చెంనాయుడు

విశాఖపట్నం..

విశాఖపట్నం ఈస్ట్: వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖపట్నం సౌత్: వాసుపల్లి గణేష్ బాబు. ఈయన వైసీపీలోకి వెళ్లిపోవడం.. ఆయన స్థానంలో ఇంచార్జిగా గండి బాబ్జిని నియమించింది టీడీపీ అధిష్టానం. అయితే, ఈ సీటు జనసేన కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

విశాఖపట్నం నార్త్ : గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్ అడుగుతున్నారు. ఇందుకు టీడీపీ అధినాయకత్వం కూడా ఓకే చెప్పేసింది. అయితే, విశాఖపట్నం నార్త్‌ను బీజేపీతో పొత్తు కుదిరితే విష్ణు కుమార్ రాజుకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

విశాఖపట్నం వెస్ట్: పి.జి.వి.ఆర్. నాయుడు

తూర్పుగోదావరి జిల్లా..

పెద్దాపురం: నిమ్మకాయల చిన్న రాజప్ప

మండపేట: వేగుళ్ల జోగేశ్వరరావు

రాజమండ్రి సిటీ: ఆదిరెడ్డి భవాని. లేదంటే ఈమె భర్త ఆదిరెడ్డి వాసు ఇక్కడ నుండి పోటీ చేయబోతున్నారు.

రాజమండ్రి రూరల్: గోరంట్ల బుచ్చయ్యచౌదరి. అయితే, ఈ స్థానం జనసేన పోత్తులో వెళ్లే అవకాశం ఉంది. కందుల దుర్గేష్‌కు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

పశ్చిమగోదావరి..

పాలకొల్లు: నిమ్మల రామానాయుడు

ఉండి: మంతెన రామరాజు. అయితే, ఈ సీటు జనసేనకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

కృష్ణ..

గన్నవరం : వల్లభనేని వంశీ (వైసిపిలోకి వెళ్లిపోయారు)*యార్లగడ్డ వెంకట్రావ్.

విజయవాడ ఈస్ట్ : గద్దే రాంమోహనరావు లేదా కేసీనేని చిన్ని.

గుంటూరు..

రేపల్లే: అనగాని సత్యప్రసాద్

గుంటూరు వెస్ట్: మద్దాలి గిరిధర్ రావు. ఈయన వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఈ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

ప్రకాశం..

పర్చూరు: ఏలూరు సాంబశివరావు

అద్దంకి: గొట్టిపాటి రవి కుమార్

చీరాల: కరణం బలరామకృష్ణ మూర్తి. ఈయన వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఈయన స్థానంలో మరొకరి టికెట్ కన్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

కొండెపి: డోలా బాలా వీరంజనేయస్వామి

అనంతపురం..

ఉరవకొండ: పయ్యావుల కేశవ్

హిందూపురం: నందమూరి బాలకృష్ణ

చిత్తూరు..

కుప్పం: నారా చంద్రబాబు నాయుడు

వైసిపి నుండి టిడిపి తీర్ధం పుచ్చుకున్నవారు..

నెల్లూరు రూరల్: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

వెంకటగిరి: ఆనం రాంనారాయణ రెడ్డి.

ఉదయగిరి: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.

తాడికొండ: ఉండవల్లి శ్రీదేవి. తనకు సీటు కావాలని అడుగుతున్నారు. కానీ తాడికొండ సీటు తెనాలి శ్రావణ్ కుమార్ కి కేటాయించారు.

Also Read:

కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఫామ్ ఇవే..!

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే!

#andhra-pradesh #telugu-desam-party #tdp #andhra-pradesh-elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe