/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/IAS.jpg)
Andhra Pradesh : ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిక కేఎస్ శ్రీనివాసరాజు (KS Sreenivas Raju) వాలంటీరి రిటైర్మెంట్ (Voluntary Retirement) తీసుకున్నారు. ఆయన వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ దానిని ఆమోదిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 2001 ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసరాజు 2011లో విశాఖపట్నం (Visakhapatnam) డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో టీటీడీ జేఈవోగా నియమితులయ్యారు. ఆ తర్వాత నుంచి జేఈవోగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్ వరకు ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు టీటీడీ జేఈవో బాధ్యతలు నిర్వహించారు.
శ్రీనివాసరాజు టీటీడీ (TTD) లో తనదైన ముద్ర వేశారు.. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇంటర్ కేడర్‌పై తెలంగాణ రాష్ట్రానికి వెళ్లారు. ఈ ఏడాది మార్చి నెలతో డిప్యుటేషన్ ముగియడంతోదాని పొడిగింపు కోసం క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే డిప్యుటేషన్ పొడిగింపునకు అనుమతి రాకపోవడంతో ఆయన తిరిగి ఏపీకి వచ్చేశారు.
శ్రీనివాసరాజు డిప్యుటేషన్‌పై తెలంగాణ (Telangana) లో నాలుగేళ్లకు పైగా విధులు నిర్వహించారు. అక్కడ రహదారులు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. డిప్యూటేషన్ గడువు ముగియడంతో గత మే నెలలో ఏపీ సీఎస్‌కు రిపోర్టు చేశారు. టీటీడీ జేఈవోగా సుదీర్ఘకాలంగా పనిచేసిన కేఎస్ శ్రీనివాసరాజు టీటీడీ ఈవోగా వెళ్లేందుకు ప్రయత్నించారనే టాక్ వినిపిస్తుంది. అయితే టీటీడీ ఈవోగా శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. దీంతో ఈనెల 19న శ్రీనివాసరాజు వీఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మంగళవారం ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు.
Also read: మోదీ 3.0 తొలి కానుక…ఆ రోజునే తొలి వందేభారత్ స్లీపర్ ట్రైన్!