AP Rains Alert : భానుడి (Sun) భగభగలు నుంచి విముక్తి దొరికినట్టే అనిపిస్తోంది. వరుణుడి చిలిపి చినుకులను ఏపీ ప్రజలు అస్వాదించే రోజులు రానే వచ్చాయి. నిన్నమొన్నటివరకు ఎండవేడితో అల్లాడిన ప్రజలు ఇప్పుడు కాస్త సేద తీరవచ్చు. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని వాతావరణశాఖ (IMD) స్పష్టం చేసింది. ఏపీకి రేయిన్ అప్‌డేట్ ఇచ్చింది.
ఏ జిల్లాల్లో వానలు పడతాయంటే?
రానున్న 5 రోజుల పాటు ఏపీకి ఇక వానలే వానలట. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కూడా. అంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అర్థం. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇక అనకాపల్లి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోనూ భారీ వర్షాలు:
ఇక ఇప్పటికే పలు ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి వానలు దంచికొడుతున్నాయి. ఇక వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఇటు తెలంగాణ (Telangana) లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న(గురువారం) హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. హయత్‌నగర్‌లో అత్యధికంగా 31.3 మిమీ, బండ్లగూడలో 19.5 మిమీ, సరూర్‌నగర్‌లో 18.3 మిమీ, చాంద్రాయణగుట్టలో 17.8 మిమీ, ఉప్పల్‌లో 17 మిమీ, బాలానగర్‌లో 15.5 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్‌లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
Also Read: భారీ వర్షాలకు కూలిన ఎయిర్ పోర్ట్ రూఫ్..ముగ్గురికి తీవ్ర గాయాలు!