Crime News: భార్య టార్చర్ భరించలేక భర్త ఆత్మహత్య.. పెళ్లైన 4 నెలలకే..

నెల్లూరు జిల్లా మాధవనగరంలో దారుణం చోటుచేసుకుంది. భార్య టార్చర్ భరించలేక భర్త ఉరేసుకున్నాడు. చనిపోవడానికి ముందు 'అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నా' అంటూ అతను రికార్డు చేసిన సెల్ఫీ వీడియో కన్నీరు పెట్టిస్తోంది.

New Update
Crime News: భార్య టార్చర్ భరించలేక భర్త ఆత్మహత్య.. పెళ్లైన 4 నెలలకే..

Nellore: పెళ్లైన నాలుగు నెలలకే భార్య టార్చర్ భరించలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మ.. నాన్న.. నన్ను క్షమించండి.. నాకు ఈ లైఫ్ వద్దు..నా భార్య పెట్టే టార్చర్ భరించలేకపోతున్నా.. అంటూ తాను చనిపోవడానికి ముందు భర్త సెల్ఫీ వీడియో తీశాడు. ఈ దారుణమైన ఘటన నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో చోటుచేసుకుంది.

Also Read: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం.. పేరెంట్సే చంపేశారా?

మాధవనగరంలో బ్రహ్మయ్య, ప్రభావతిల కొడుకు హరీష్. నాలుగు నెలల క్రితమే భారతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, పెళ్లైన నాలుగు నెలలకే హరీష్ తన భార్య భారతి పెట్టే టార్చర్ భరించలేకపోయాడు. భార్య తన తల్లిదండ్రులకు లేనిపోనివి చెప్పి తనను టార్చర్ పెడుతుందని..ఈ లైఫ్ నాకు వద్ద అని భర్త ఎమోషనల్ అవుతూ ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: దిగజారిపోయిన బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి.. పన్నెండేళ్ల తరువాత మళ్ళీ ఇలా..

ఘటనపై పోలీసులకు సమాచారం అందించినా వారు సరిగా స్పందించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కనీసం పోస్ట్ మార్టం కూడా జరిపించకపోవడంతో  అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు