AP: మున్సిపల్ కార్మికులకు గుడ్ న్యూస్.. భారీగా వేతనాలపెంపు!

మున్సిపల్ కార్మికులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికుల 16 డిమాండ్లలో 9 సమస్యలను పరిష్కరించేందుకు అంగీకరించింది. కార్మికుల జీతాలు 5వేలకు పైగా పెంచుతున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

New Update
AP: మున్సిపల్ కార్మికులకు గుడ్ న్యూస్.. భారీగా వేతనాలపెంపు!

Muncipal: ఏపీ గవర్నమెంట్ మున్సిపల్ కార్మికులకు తీపి కబురు అందించింది. పలు డిమాండ్లతో అధికారుల చుట్టూ తిరుగుతున్న వారి సమస్యలను పర్కిష్కరించేందుకు జగన్ సర్కార్ సానుకూలంగా స్పందించింది. దీంతో కొంతకాలంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కింది.

16 డిమాండ్లకు 9 పరిష్కారం..
ఈ మేరకు మున్సిపల్ కార్మికుల 16 డిమాండ్లలో 9 సమస్యలను పరిష్కరించబోతున్నట్లు చెబుతూ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ‘కేటగిరీ-1లో 895 మంది వర్కర్ల వేతనాలు ప్రస్తుతం రూ.18,500 ఉండగా వచ్చే నెల నుంచి రూ. 24వేలు అందించనున్నట్లు తెలిపారు. ఈ లెక్కన ఒక్కొక్కరికి రూ.5500 పెంచి ఇవ్వబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే కేటగిరీ-2లో 31,600 మంది మున్సిపల్ కార్మికులకు ఇకపై రూ.21వేలు అందిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Vyooham Movie Review: ఇది వ్యూహాత్మకమే.. ఆర్జీవీ వ్యూహం ఎలా ఉందంటే..

ఇక మున్సిపల్ కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రస్తుతం ఇస్తున్న రూ.10 లక్షలను రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి ఆదిమూలపు తెలిపారు. అలాగే శాశ్వత అంగవైకల్యానికి రూ.20 లక్షల, అంగవైకల్యానికి రూ.10 లక్షలు ఇస్తామని ఆయన వెల్లడించారు.

మా పోరాటం ఫలించింది:
ఇక దీనిపై కార్మిక సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. తమ పోరాటం కారణంగానే ప్రభుత్వం దిగి వచ్చిందని కార్మిక సంఘాల ఐకాస రాష్ట్ర కన్వీనర్ పోరుమామిళ్ల సుబ్బరాయుడు తెలిపారు. ప్రభుత్వం అంగీకరించిన హామీలను ఎన్నికలకు ముందే అమలు చేయాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు