Andhra Pradesh Sanitation: మునిసిపల్ సిబ్బంది ధర్నా నేపథ్యంలో ఏపీ సర్కార్(Andhra Pradesh Government) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డ సచివాలయ సిబ్బందికి శానిటేషన్(Sanitation) బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికార వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్(Municipal) సిబ్బంది సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో నగరాల్లో చెత్త పేరుకుపోయింది. దీంతో చెత్త క్లీనింగ్ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే.. చెత్త క్లీనింగ్ చేయించే పనిలో సచివాలయ సిబ్బంది ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అడ్మిన్, శానిటేషన్ సెక్రెటరీతో పాటు మిగిలిన సెక్రటరీలు ఇదే పనిలో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది సర్కార్.
అంతేకాదు.. ఆదివారం సెలవును రద్దు చేసింది విజయవాడ నగర పాలక సంస్థ. వెహికల్ పంపుతాం.. చెత్త క్లియర్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, సిబ్బంది లేకుండా ఎలా సాధ్యమని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సచివాలయ సిబ్బంది. మరోవైపు విధులకు హాజరుకాకపోయిన.. చెత్త క్లియర్ చేయకపోయినా చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తలపట్టుకుంటున్నారు. ఇప్పటికే అంగన్వాడీ సమ్మె నేపథ్యంలో తాళాలు బద్దలు కొట్టే పని, నిర్వహణ పని సచివాలయ సిబ్బందికి ఇచ్చారు అధికారులు.
Also Read:
జగత్జంత్రీలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే చోరీ చేశారు..!
తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారందరికీ రూ. 5 లక్షల బీమా..