విడాకులు తీసుకుని మళ్లీ కలిశారు.. బాబు-పవన్‌పై మంత్రి బొత్స పంచ్‌లే పంచ్‌లు..

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. టీడీపీ-జనసేన 2019లో విడాకులు తీసుకుని.. ఇప్పుడు మళ్లీ కలిశాయన్నారు. లోకేష్ మాటల్లో అర్థం ఉండదని కొట్టిపడేశారు. త్వరలో విశాఖకు రాజధానిని తరలిస్తామని చెప్పారు మంత్రి బొత్స.

New Update
విడాకులు తీసుకుని మళ్లీ కలిశారు.. బాబు-పవన్‌పై మంత్రి బొత్స పంచ్‌లే పంచ్‌లు..

Andhra Pradesh Minister Botsa Satya Narayana: జనసేన-టీడీపీ పొత్తుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్‌ను కలిపి దుమ్ము దులిపారు. యువగళం పాదయాత్ర ముగింపు సభలో ఈ ముగ్గురు నేతలు చేసిన కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అన్నీ నోటు చేసుకున్నామంటూ లోకేష్ చేసిన కామెంట్స్‌పై సీరియస్‌గా స్పందించారు మంత్రి బొత్స. రాజకీయాల్లో కావాల్సింది రెడ్ బుక్ కాదని, బ్లూ బుక్ కావాలని అన్నారు. ఏం చేసినా చట్టబద్ధంగా ఉండాలని హితవు చెప్పారు మంత్రి. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను ప్రభుత్వం ఎక్కడా అడ్డుకోలేదన్నారు. లోకేష్ పిల్లాడు అని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయకే అర్థం కాదని ఎద్దేవా చేశారు.

ఇదే అంశంపై గురువారం నాడు మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ విపక్షాలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. త్వరలో వారి ప్రభుత్వం వస్తుందని లోకేష్ నిద్రలో కలగని ఉంటాడని, అలాగే కలలో జీవించనివ్వండి అంటూ సెటైర్లు వేశారు. పవన్, చంద్రబాబుపై పంచ్‌లు వేశారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చారని, అది చారిత్రక ఘట్టం కాదా? అని ప్రశ్నించారు మంత్రి బొత్స. ఇప్పుడేదో కొత్తగా కలిసినట్లు.. కొత్తగా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2014లో టీడీపీ-జనసేన కలిసే పోటీ చేశాయని, 2019లో విడాకులు తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు మళ్లీ కలిశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దొంగల ముఠా మళ్లీ వస్తోందని, ప్రజలు నమ్మోద్దని చెప్పారు మంత్రి బొత్స.


విశాఖే రాజధాని..

విశాఖపట్నమే రాజధాని అని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని తరలించడం జరుగుతుందని, త్వరలోనే వైజాగ్ వస్తామని స్పష్టం చేశారు మంత్రి బొత్స. విశాఖను పరిపాలన రాజధాని చేయాలనేది తమ విశ్వాసం అని పేర్కొన్నారు. ఇదొక యజ్ఞంగా అభివర్ణించిన మంత్రి బొత్స.. ఈ యజ్ఞాన్ని బగ్నం చెయ్యాలని చూస్తున్నారంటూ విపక్ష నేతలపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భోగాపురం టెండర్‌ను ఎందుకు క్యాన్సిల్ చేశారని ప్రశ్నించారు. 14 ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. ఉత్రరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుకు చేతకాక ఏదిపడితే.. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుది నోరా తాటి మట్టా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:

తెలంగాణలో కలకలం రేపుతున్న కొత్త కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు..

Advertisment
తాజా కథనాలు