Andhra Pradesh Liquor Workers Union: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాయంలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న లిక్కర్ వర్కర్స్ పాల్గొన్నారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నిర్వహిస్తుండటం వలన రాష్ట్రంలో దాదాపు 1 లక్షా 75 వేల మంది లిక్కర్ వర్కర్స్ రోడ్డున పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: రాజధానిపై మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్..
రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ వర్కర్స్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు తమ సమస్యలు చెప్పుకుందామని సీఎం జగన్ ను కలిసే ప్రయత్నం చేస్తుంటే అక్రమంగా తమను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు లిక్కర్ వర్కర్స్. కాగా, ఏపీలో మద్యం అమ్మకాలు అనేది ఓ పెద్ద రాజకీయ అంశం అని చెప్పవచ్చు. జగన్ హయాంలో ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్లు… తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
Also Read: రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ.. పెద్దల సభకు వెళ్లేది వీరేనా?
మునుపెన్నడూ లేని విధంగా ఏపీలో జగన్ తన సొంత బ్రాండ్లు పెట్టి చీప్ గా లిక్కర్ అమ్ముతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. మద్యం రేట్లు ఆకాశాన్నంటుతున్నా…బ్రాండ్లు మాత్రం నాసిరకం ఉన్నాయంటూ రచ్చ రచ్చ జరిగింది. మద్యపాన నిషేధం అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైసీపీ జగన్…అధికారంలోకి వచ్చాక తన సొంత కంపెనీల మద్యాన్ని అమ్ముకుంటున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.