CM Chandrababu: మలేషియాలో కుప్పం మహిళ మృతి.. బాధిత కుటుంబానికి సాయంపై సీఎం హామీ..!

మలేషియాలో జరిగిన ప్రమాదంలో కుప్పం మహిళ విజయలక్ష్మి గల్లంతయ్యారు. హఠాత్తుగా కుంగిన రోడ్డు వల్ల ఆమె ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు బాధిత కుటుంబానికి సాయంపై హామీ ఇచ్చారు.

New Update
CM Chandrababu: మలేషియాలో కుప్పం మహిళ మృతి.. బాధిత కుటుంబానికి సాయంపై సీఎం హామీ..!

CM Chandrababu: కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లికి చెందిన జి.పళని కుమార్తె విజయలక్ష్మి(40) మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యారు. కొద్ది రోజుల క్రితం మలేషియా వెళ్లిన ఆమె ఉదయం రోడ్డుపై నడుస్తూ వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. హఠాత్తుగా కుంగిన రోడ్డు వల్ల విజయలక్ష్మి ఒక్కసారిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పడిపోయారు.

Also Read: హీరో నాగార్జునకు రేవంత్ సర్కార్ షాక్!

స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికీ ఆమె ఆచూకి దొరకలేదు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం సూచనల మేరకు బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్ కలిసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అవసరమైన సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

Advertisment
తాజా కథనాలు