AP: పెళ్లి చూపుల కేసులో కొత్త ట్విస్ట్‌.. ఒక్క రాత్రికి రా అంటూ..

కాకినాడలో పెళ్లి చూపుల కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. పెళ్లి కొడుకుపై కలెక్టర్‌, పోలీసులకు పెళ్లి కూతురు ఫిర్యాదు చేసింది. పెళ్లి కొడుకు కృష్ణమోహన్‌ ఫోన్‌ చేసి ఒక్క రాత్రి ఒంటరిగా రావాలని బెదిరించాడని తెలిపింది. మధ్యవర్తులే మొత్తం డబ్బు, బంగారం తీసుకున్నారని ఆరోపించింది.

New Update
AP: పెళ్లి చూపుల కేసులో కొత్త ట్విస్ట్‌.. ఒక్క రాత్రికి రా అంటూ..

Kakinada Marriage Cheating Case: పెళ్లి పేరుతో తనను ఆరుగురు మహిళలు మోసం చేశారని కాకినాడలో కృష్ణమోహన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వివాహితను పెండ్లికుమార్తెగా చూపించి రూ. 6 లక్షలు, బంగారు నగదు స్వాధీనం చేసుకున్నారని అధికారులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా తాజాగా, ఈ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.

Also Read : టీడీపీ కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీకి దూరం

పెళ్లి కొడుకు కృష్ణమోహన్ పై పెళ్లి కూతురు చిన్ని అలియాస్‌ నీరజా కలెక్టర్‌, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంగేజ్‌మెంట్‌ పేరుతో తనను మోసం చేశారని కలెక్టర్‌కు కంప్లైంట్‌ చేసింది. పెళ్లి పేరుతో ఆ ఇద్దరు మహిళలు తనని కూడా మోసం చేశారని ఆరోపించింది. తన ప్రమేయం లేకుండా తనని పెళ్లి కూతురిని చేశారని చిన్ని ఆరోపిస్తుంది.

రాజమండ్రి నామవరం చుట్టాల ఇంటికి వస్తే.. చెప్పపెట్టకుండా పెళ్లి చూపులు పెట్టడంతో సెలైంట్‌గా ఉన్నానని.. ఆ తర్వాత తన పెద్దమ్మకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పానని తెలిపింది. లేటు వయస్సులో పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు కృష్ణమోహన్ తనకు నచ్చలేదని ముందే చెప్పానని వెల్లడించింది.

కానీ, ఆ తర్వాత పదేపదే కృష్ణమోహన్‌ ఫోన్‌ చేయడం.. తరువాత ఒంటరిగా ఒక్క రాత్రి రావాలని.. లేకపోతే పెళ్లి కాకుండా చేస్తానని బెదిరింపులకు దిగాడని చిన్ని ఆరోపిస్తుంది. తమకు ఎటువంటి బంగారం, డబ్బు ఇవ్వలేదని.. మధ్యవర్తులే మొత్తం డబ్బు, బంగారం తీసుకున్నారని తెలిపింది. పెళ్లి పేరుతో ఈ ముఠా చాలా మోసాలకు తెగబడిందని ఆరోపించింది.

Advertisment
తాజా కథనాలు