AP Inter Exam :ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్ష వాయిదా! ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో భాగమైన పర్యావరణ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్ విద్యామండలి పేర్కొంది. శనివారం (ఫిబ్రవరి 3) న జరగాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23 (శుక్రవారం) కి మార్చినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. By Bhavana 02 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి AP Inter Exam: ఏపీ లో ఇంటర్ (Inter) చదువుతున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్ (Alert) . ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరీక్ష(Environmental Exam) , నైతికత-మానవ విలువల పరీక్షలను ముందుగానే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వాటిని ఫిబ్రవరి 2, 3 తారీఖులో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే శనివారం నాడు జరగాల్సిన పర్యావరణ పరీక్షను వాయిదా వేసినట్లు అధికారులు వివరించారు. అయితే పరీక్షను ఎందుకు వాయిదా వేశారు అనే విషయాన్ని మాత్రం అధికారులు తెలియజేయలేదు. శనివారం (ఫిబ్రవరి 3) న జరగాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23 (శుక్రవారం) కి మార్చినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు జరగాల్సిన నైతికత- మానవ విలువల పరీక్షను మాత్రం నిర్వహిస్తున్నారు. Also read: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..వారంలో మూడో కేసు! #ap #postponed #exams #inter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి