AP Farmers : రైతులకు జగన్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. ఇవాళ అన్నదాతల ఖాతాలలో డబ్బులు జమ!

రబీ సీజన్‌ ఆరంభంలో మిచాంగ్‌ తుఫాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించనుంది జగన్‌ సర్కార్‌. విపత్తుల వల్ల నష్టపోయిన సుమారు 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందించనున్నారు. ఇవాళ రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో నేరుగా నగదు జమ చేయనున్నారు.

AP Farmers : రైతులకు జగన్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. ఇవాళ అన్నదాతల ఖాతాలలో డబ్బులు జమ!
New Update

Andhra Pradesh Farmers Input Subsidy : ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. తీవ్ర నష్టం వాటిల్లినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Central & State Governments) కచ్చితంగా సాయం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తుపానులు, వరదలు వచ్చినప్పుడు రైతులు ఎక్కువగా నష్టపోతారు. అందుకే వారి కోసం ప్రభుత్వం సహాయక చర్యలను చేపడుతోంది. ఈ క్రమంలో జగన్‌ సర్కార్‌ ఇవాళ రైతులకు పంట నష్టం పరిహారం చెల్లించనుంది. వారి బ్యాంక్‌ అకౌంట్లలో నేరుగా నగదు జమ చేయనుంది.

రైతులకు డబ్బులు జమ:

ఇవాళ తాడేపల్లి(Tadepalle) లోని క్యాంప్ ఆఫీస్‌ నుంచి ఏపీ సీఎం జగన్‌(AP CM Jagan) కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాలలో నగదు జమ చేయనున్నారు. 2023 ఖరీఫ్ సీజన్లో సాగునీటి కరువు ఏర్పడి పంటలు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం సాయం అందించనుంది. 2023-2024 రబీ సీజన్‌(Rabi Season) లో తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. వారందరికి ఇవాళ సాయం అందనుంది. మిచౌంగ్‌ తుపాను ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసిందే . విపత్తు బాధిత రైతులకు పరిహారం కింద 11.59 లక్షల మందితో జాబితాను రెడీ చేసిన ప్రభుత్వం. వారి కోసం రూ.1,294 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వనుంది. రైతుల ఖాతాల్లో డబ్బులను జగన్‌ జమ చేయనున్నారు.

తీవ్ర నష్టాన్ని మిగిల్చిన తుపాను:

గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు(Farmers) దాదాపు 2 వేల కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీ(Input Subsidy) ని అందించింది ప్రభుత్వం. తాజాగా చెల్లించే సాయంతో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ.3,271 కోట్లు అందించినట్లవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలలో గతేడాది డిసెంబర్‌లో మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టించింది. రైతుల పరిస్థితి దయనీయంగా మారిన రోజులవి. తుపాను ప్రభావంతో పంటలు నీట మునిగి, గాలులకు నేలవాలి రైతులు పూర్తిగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి, పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి పండించిన పంట అమ్ముకునే సమయంలో అన్నదాతలకు అనేక కష్టాలు తెచ్చిపెట్టింది తుపాను.అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు ఆందోళన చెందారు. అనేక చోట్ల టన్నుల కొద్దీ ధాన్యం నీటిపాలైంది. లమైన ఈదురుగాలుల దాటికి నిల్వలు చెల్లాచెదురయ్యాయి. ఆ దెబ్బకు కోలుకోవడం కష్టమేనని ధాన్యం పండించిన రైతులు బోరుమన్నారు.

Also Read : సుప్రీం కోర్టును ఆశ్రయించిన అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు!

#andhra-pradesh #farmers #input-subsidy #ys-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe