Andhra Pradesh: అందుకే చంద్రబాబు జైల్లో ఉన్నారు.. హోంమంత్రి వనిత సంచలన కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అవడంపై రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఆయన తప్పు ఉంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని అన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కావడంతో గౌరవం ఇచ్చామని, ఆ గౌరవంతోనే జైలుకు తరలించేందుకు చాపర్ కూడా ఏర్పాటు చేశామన్నారు.

New Update
Taneti Vanitha: అందుకే జగన్ పై దాడి చేశారు: తానేటి వనిత

AP Home Minister Vanitha: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అవడంపై రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత(Home Minister Vanitha) స్పందించారు. ఆయన తప్పు ఉంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని అన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కావడంతో గౌరవం ఇచ్చామని, ఆ గౌరవంతోనే జైలుకు తరలించేందుకు చాపర్ కూడా ఏర్పాటు చేశామన్నారు. కానీ, ఆయనే తన రాజకీయ స్వలాభం కోసం రోడ్డు మార్గాన్నే ఎంచుకున్నారని చంద్రబాబు తీరును విమర్శించారు హోంమంత్రి వనిత. ఇదే విషయమై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటున్నాయని, చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా డే వన్ నుంచి ఆయనకు గౌరవం ఇచ్చామన్నారు మంత్రి. కానీ, చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబు భద్రతపై రియాక్షన్ ఇదీ..

రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపైనా హోంమంత్రి వనిత రియాక్ట్ అయ్యారు. నేటి కాలంలో రాజకీయ కుట్రతో జైల్లో వేసే పరిస్థితులు లేవన్నారు. ఇక చంద్రబాబు భద్రతపై స్పందించిన హోం మంత్రి.. అదేమైనా సాధారణ జైలా? అని అన్నారు. చంద్రబాబుకు ఏకంగా ఓ బ్లాక్‌నే కేటాయించామన్నారు. సెంట్రల్ జైల్లో ఆయనకు పూర్తి భద్రత ఉందని చెప్పారు.

భువనేశ్వరి ములాఖత్ రద్దుపై స్పందన..

ఇక నారా భువనేశ్వరి ములాఖత్‌ తిరస్కరణపై స్పందించిన వనిత.. వారానికి రెండు ములాఖత్‌లు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఏదైనా అత్యవసరం అయితే.. అది మెన్షన్ చేస్తేనే జైల్ నామ్స్ ప్రకారం ములాఖ్ ఇస్తారని వివరించారు హోంమంత్రి వనిత. అదికూడా వారు సరైన కారణం చూపితేనే అంగీకరిస్తారని తెలిపారు. కానీ, వారు ప్రస్తుతం చూపించిన కారణం న్నామ్స్ ప్రకారం లేదు కాబట్టే అధికారులు రిజెక్ట్ చేసి ఉంటారని తెలిపారు. ములాఖత్‌ విషయం జైలర్ పరిధిలో ఉంటుందన్నారు. వాళ్ళు రూల్స్ ప్రకారం నడుచుకుంటారని, అంతే తప్ప ఇందులో రాజకీయ కక్ష్య సాధింపు ఏమీ లేదన్నారు.

బుచ్చయ్య చౌదరికి కౌంటర్..

ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి వనిత. టీడీపీ జనసేన కలయిక పాత న్యూస్ అని, అందులో మైండ్ బ్లాక్ అయ్యేది ఏముందని ప్రశ్నించారు. వారికి ఎన్ని సీట్లు వస్తాయనేది ప్రజలే తేలుస్తారని, తామేమీ మాట్లాడబోమని స్పష్టం చేశారు. అయితే, ఈసారి కూడా ఏపీలో జగనే ముఖ్యమంత్రి అవుతారని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక నాంకే వాస్తే మినిస్టర్ అంటూ చేసిన కామెంట్స్‌పై స్పందించిన మంత్రి అని.. తనను హోంమంత్రిగా చూసి తట్టుకోలేని వాళ్లే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను నాంకే వాస్తే మనిస్టర్ అస్సలు కాదన్నారు. ఎవరి కడుపుమంట వారిదని, దాని ప్రకారం వారు కామెంట్స్ చేస్తారని, వాటిని తాను పట్టించుకోబోనని స్పష్టం చేశారు మంత్రి వనిత.

Also Read:

Asia Cup 2023: తడబడ్డ భారత బౌలర్లు.. బంగ్లాదేశ్‌ స్కోర్‌ ఎంతంటే..?

Telangana: మరో కీలక పథకం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యార్థులకు ఇక నుంచి..

Advertisment
Advertisment
తాజా కథనాలు