ఉత్తర కోస్తా నుంచి అంతర్గత రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి కారణంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు కాస్త తగ్గాయి. అయితే నంద్యాల జిల్లా గోస్పాడులో 44.4, కడప జిల్లా వెడురూరులో 44.3, కర్నూలు జిల్లా వగరూరులో 43.8, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.2, అన్నమయ్య జిల్లా సానిపాయలో 43.1డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తరకోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, జంగమేశ్వరపురం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరుతో పాటుగా తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గాయి. అత్యధికంగా కావలిలో 24 గంటల వ్యవధిలో 6.9 డిగ్రీల తగ్గుదల నమోదైంది.ఉత్తర కోస్తా నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. కొద్దిరోజులుగా తీవ్రమైన ఎండలతో వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. ఈ రెండింటి ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మేఘాలు ఆవరించాయి. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. మంగళవారం 39 మండలాల్లో, బుధవారం 66 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం(12), పార్వతీపురం మన్యం(11), అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 3 మండలాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది.అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడులో 44.4 డిగ్రీలు, కడప జిల్లా వెడురూరులో 44.3, కర్నూలు జిల్లా వగరూరులో 43.8, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 43.2, అన్నమయ్య జిల్లా సానిపాయలో 43.1, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా.. 37 మండలాల్లో వడగాలులు వీచాయి.