Agri Gold Land Case : మాజీ మంత్రికి బిగ్ రిలీఫ్.. జోగి రాజీవ్ కు బెయిల్!

మాజీ మంత్రి జోగి రమేష్‌ కొడుకు జోగి రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో జోగి రాజీవ్‌‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 13 నుంచి ఆయన జైలులో ఉండగా.. ఎట్టకేలకు బెయిల్ లభించింది.

New Update
Agri Gold Land Case : మాజీ మంత్రికి బిగ్ రిలీఫ్.. జోగి రాజీవ్ కు బెయిల్!

Jogi Rajeev : అగ్రిగోల్డ్ భూమల కేసు (Agri Gold Land Case) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ (Jogi Ramesh) కొడుకు జోగి రాజీవ్‌కు విజయవాడ (Vijayawada) ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జోగి రాజీవ్ కు కండిషన్ బెయిల్ ఇవ్వడంతో ఆయన విజయవాడ జిల్లా జైల్ నుండి విడుదల అయ్యారు.

Also Read : అవసరమైతే స్పీకర్ పదవినైనా వదులుకుంటా.. అయన్నపాత్రుడు సెన్షేషనల్ కామెంట్స్..!

తన పాస్ పోర్ట్ ఏసీబీ స్టేషన్ లో సబ్మిట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. రూ. 25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ప్రతి నెల రెండో శనివారం స్థానిక ఏసీబీ స్టేషన్ లో సంతకం పెట్టాలని చెప్పారు. కేసుకు సంబంధించి మీడియాతో ఎక్కడ మాట్లాడవద్దని హెచ్చరించారు.

Also Read: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉద్రిక్తత.. రెండు వర్గాల మధ్య ఘర్షణ..!

అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఆగస్టు 13న జోగి రాజీవ్‌‌ను ఏసీబీ అధికారులు (ACB Officials) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన A2గా ఉన్నారు. సీఐడీ జప్తులో ఉన్న అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను జోగి రాజీవ్‌ కొనుగోలు చేసి ఇతరులకు అమ్మినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు