Chandrababu Naidu Arrest: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను సైకో అంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ.. చంద్రబాబును జైల్లో వేశారన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్న నారా లోకేష్.. జాతీయ స్థాయి నేతలతో భేటీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు లోకేష్. చంద్రబాబుతో పవన్ ములాఖత్‌పై సీఎం జగన్ చేసిన కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించారు. సైకో జగన్‌ను గద్దే దింపే వరకు ఊరుకునేదే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. జైల్లో వేసినా.. పోరాటం ఆగదని స్పష్టం చేశారు నారా లోకేష్. తాను స్టాన్‌పోర్డ్‌లో ఎంబీఏ చేశానని.. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన లోకేష్.. కేసులు పెడితేనో.. జైల్లో వేస్తేనో భయపడే వాళ్లం అస్సలు కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలను వేధిస్తున్న సైకో జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతో తాము పని చేస్తామని చెప్పారు లోకేష్.
చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కలిసి పోరాడాలని నిర్ణయించామని వెల్లడించారు నారా లోకేష్. ఇందులో భాగంగానే 2024లో జరుగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్. భవిష్యత్‌కు గ్యారేంటీ పేరుతో చంద్రబాబు యాత్ర.. వారాహి పేరుతో పవన్ కల్యాణ్ యాత్ర.. యువగళం పేరుతో తాను యాత్ర చేపట్టడంతో జగన్ బెదిరిపోయారని, తమ యాత్రలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నించిందని ఆరోపించారు. పలు చోట్ల వైసీపీ కార్యకర్తలపై తమపై రాళ్లతో దాడులు చేయడమే కాకుండా.. రివర్స్‌గా తమపైనే హత్యాయత్నం కేసులు పెట్టించారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఈ సైకో జగన్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
అరగుండుతో టీడీపీ శ్రేణుల నిరసన..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ వెంకటగిరి పట్టణంలో టిడిపి నాయకుడు డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు అర గుండుతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి ప్రదాత, సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరెస్ట్‌కు నిరసనగా.. అరగుండుతో టీడీపీ కేడర్ అంతా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబును వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: