Andhra Pradesh Elections: ఏపీలో ఎన్నికల మూడ్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్‌ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై ఉన్న అధికారులు, ఉద్యోగుల బదిలీలను నిషేధిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

New Update
Andhra Pradesh Elections: ఏపీలో ఎన్నికల మూడ్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ..

Andhra Pradesh Assembly Elections: తెలంగాణలోనే కాదు.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ(Andhra Pradesh) ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్‌ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై ఉన్న అధికారులు, ఉద్యోగుల బదిలీలను నిషేధిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన సిబ్బంది ఖాళీలపైనా అక్టోబర్ 10వ తేదీలోగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.

ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఏ రాష్ట్రంలోనైనా ముందుగా అధికారుల బదిలీలు, ప్రమోషన్లు, విధుల మార్పులు, చేర్పులు జరుగుతాయి. తమకు అనుకూలంగా ఉన్నవారిని, అనుకూలమైన చోటకు ట్రాన్స్‌ఫర్ చేస్తారనే ఒక టాక్ పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తుంటుంది. అందుకే, ఇలాంటి చర్యలను కట్టడి చేసేందుకే ఈసీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా 6 నెలల వరకు సమయం ఉంది. దాంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఏపీలో రాజకీయం మరింత ఉడుకుతోంది. ఈ క్రమంలో ఈసీ సైతం ఎన్నికలపై దృష్టి సారించడం పొలిటికల్‌గా మరింత ఇంట్రస్ట్ క్రియేట్‌ చేసింది. ఒకవేళ ఏపీలో ముందుస్తు ఎన్నికలు ఏమైనా జరుగుతాయా? అని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు.

ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Also Read:

మీ పిల్లలు నిద్రలో మాట్లాడుతున్నారా? దీనికి కారణమిదేనట..!

సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కీలక అప్‌డేట్ ఇచ్చిన మంత్రి కేటీఆర్.. ఆయనకేమైందంటే..

Advertisment
తాజా కథనాలు