Andhra Pradesh Elections: ఏపీలో ఎన్నికల మూడ్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములై ఉన్న అధికారులు, ఉద్యోగుల బదిలీలను నిషేధిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.