Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఉద్రిక్తత నెలకొంది. పిఠాపురం నియోజకవర్గంలోని గ్రామ సభలో రసాభాస జరిగింది. గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో రెండువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామ సమస్యలపై అభిప్రాయాలు తెలపాలని సర్పంచ్ నాగబాబు అన్నారు. ఈ మేరకు సెక్రటరీకి సమస్యలు చెబుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.
Also Read: అనుమతి లేని లే అవుట్ లకు భారీ పెనాల్టీ: మంత్రి నారాయణ
కందా రామకృష్ణ అనే వ్యక్తిపై మరో వ్యక్తి కర్రతో దాడి చేయగా అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. జనసేన కార్యకర్తలు, ఎంపీ శ్రీనివాస్ వర్గీయుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ ఇదే గ్రామంలో వర్మ కారుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
పాత గొడవలతోనే గ్రామసభలో ఘర్షణ తలెత్తినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.