/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Vizianagaram-Train-Accident-jpg.webp)
Vizianagaram Train Accident: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనకు సంబంధించి వివరాలపై ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీస్తున్నారు సీఎం జగన్.
ప్రమాద స్థలికి మంత్రి బొత్స సత్యనారాయణ..
మరోవైపు, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రమాద స్థలికి చేరుకున్నారు. సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అవసమైన చర్యలను తీసుకుంటున్నారు. క్షతగాత్రులను తరలించేందుకు 14 అంబులెన్స్‌లు ప్రమాద స్థలికి చేరుకున్నాయి. బాధితులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖ నుంచి రిలీఫ్ రైలు ప్రమాద స్థలికి చేరుకుంది. అయితే, ప్రమాదం జరిగిన ప్రదేశంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకట్లోనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు అధికారులు.
సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించి, దగ్గరలో ఉన్న ఆస్పత్రుల్లో వైద్యం అందించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఘటనకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.
2/2— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 29, 2023
Also Read:
అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..