ఏపీలోని సీఎం జగన్ సర్కార్ (AP Government) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ కింది అంశాలకు ఆమోదం తెలిపింది జగన్ సర్కార్..
ఇది కూడా చదవండి: Supreme Court: జగన్ కు సుప్రీం షాక్.. అక్రమాస్తుల కేసులో నోటీసులు.!
- SIPB ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన కేబినెట్.
- రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్.
- ఈ నెల 15 నుంచి కుల గణన ప్రారంభం.
- దేవాలయాల ఆదాయ పరిమితులు ఆధారంగా కేటగిరీల్లో మార్పులకు ఆమోదం
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం
- టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు గ్రూప్-1 పోస్ట్ ఇచ్చేందుకు ఆమోదం
- ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన డీఏ కు ఆమోదం తెలిపిన కేబినెట్
- జగనన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్ లో చర్చ
ఇది కూడా చదవండి: AP high court:చంద్రబాబు మధ్యంతర బెయిల్ అదనపు షరతుల పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
పై నిర్ణయాలతో పాటు ఏపీలోని 6,790 ఉన్నత పాఠశాలల్లో స్కిల్ డవలప్మెంట్ కోసం కేంద్రాల ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప, నంద్యాల జిల్లాల్లో ఎక్రెన్ ఎనర్జీకి 902 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 5,400 ఎకరాల భూమి కేటాయింపునకు సైతం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం నిర్వాసితులకు సైతం జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి ఇళ్ల పట్టాలు, స్థలాల రిజిస్ట్రేషన్‌కు స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపు ఇవ్వాలని ఈ రోజు జరిగి కేబినెట్ నిర్ణయం తీసుకుంది.