Andhra Pradesh: స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. చంద్రబాబు బెయిల్‌ రద్దు కోరుతూ సీఐడీ అఫిడవిట్..

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని హైకోర్టును కోరింది సీఐడీ.

Andhra Pradesh: స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. చంద్రబాబు బెయిల్‌ రద్దు కోరుతూ సీఐడీ అఫిడవిట్..
New Update

Skill Scam Case: స్కిల్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఇవాళ హైకోర్టులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా.. ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సైతం రద్దు చేయాలని కోరుతూ ఏపీ సీఐడీ అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫడవిట్‌లో కీలక అంశాలను పేర్కొన్నారు. చంద్రబాబు బెయిల్ కండీషన్స్ ఉల్లంఘిస్తూ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని అన్నారు. ఈ కేసులో నిందితులైన సుమన్ బోస్, వికాస్ ఖన్వేల్కర్ లు సాక్షులను బెదిరించే విధంగా ప్రయత్నించారని సీఐడీ అధికారులు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇంకా ఈ అఫడవిట్‌లో కీలక వివరాలను పేర్కొన్నారు. అవేంటో ఓసారి పాయింట్ల వారీగా చూద్దాం..

☛ ఈ కేసులో నిందితులైన సుమన్ బోస్, వికాస్ ఖన్వేల్కర్ లు సాక్షులను బెదిరించే విధంగా ప్రయత్నించారు.
☛ 2015 నుంచి 2018 వరకు పెద్ద మొత్తంలో టీడీపీ ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమ అయ్యాయి.
☛ 2016 నవంబర్ నుంచి 2017 జనవరి మధ్యలో టీడీపీ ఖాతాలోకి జమ అయిన డబ్బులో చాలా వరకు 1000రూపాయల నోట్లు ఉన్నాయి.
☛ నోట్ల రద్దు తరువాత పాతనోట్లను పెద్ద ఎత్తున ఈ అకౌంట్లలోకి జమచేశారు.
☛ ఇప్పటికే ఈ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని టీడీపీ ఆఫీస్ కోశాధికారికి నోటీసులు జారీచేశాం.
☛ నాలుగు వారాల్లో వివరణ ఇస్తామన్న టీడీపీ నాయకులు ఇప్పటి వరకు ఎలాంటి పత్రాలు ఇవ్వలేదు.
☛ టీడీపీ కార్యాలయానికి సంబంధించిన అకౌంట్ డాక్యుమెంట్ల కోసం మరోసారి ఈ నెల 13న నోటీసులు ఇచ్చినా టీడీపీ నాయకులు స్పందించడం లేదు.
☛ చంద్రబాబే టిడిపికి సంబంధించి బ్యాంకు ఖాతాలకు సిగ్నేటరీగా ఉన్నారు.
☛ ఆయన ప్రభావం వల్లే టీడీపీ కార్యాలయ సిబ్బంది స్పందించడం లేదు.
☛ చంద్రబాబు ప్రభావంతోనే ఈ కేసులో కిలారి రాజేశ్ విచారణకు సహకరించడం లేదు.
☛ చంద్రబాబు పిఏ పెండ్యాల శ్రీనివాస్ తో పాటు మనోజ్ వాసుదేవ్ కూడా చంద్రబాబు ప్రభావం వల్లే విచారణకు హాజరుకావడం లేదు.
☛ చంద్రబాబు విడుదలైన వెంటనే ఈ కేసులో ఉన్న సాక్షులను బెదిరించే విధంగా టీడీపీ నాయకుడు పయ్యావుల కేశవ్ మీడియాలోమాట్లాడారు.

సీఐడీ దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read:

పాలమూరు బరిలో కోటీశ్వరులు.. ఎవరి ఆస్తులు ఎంతంటే..!

‘వారిని బూటుతో కొట్టాలి’ అంటూనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు..

#skill-scam-case #chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి