Breaking: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రేపు ఢిల్లీకి జగన్..! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి జరగనున్నాయి. మొత్తం ఆరు రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో జగన్ సర్కార్ తర్వాతి స్టెప్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. By Trinath 12 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Andhra Pradesh Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21 నుంచి జరగనున్నాయి. మొత్తం ఆరు రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ప్రకటన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో జగన్ సర్కార్ తర్వాతి స్టెప్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఢిల్లీకి జగన్: రాష్ట్రంలో ప్రస్తుత వ్యవహారాలు, శాంతిభద్రతలను అంచనా వేయడానికి సీఎం జగన్ (CM Jagan) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని అంచనా. వైసీపీ ఎమ్మెల్యేలతో చర్చించి వచ్చే వారం క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలోనే జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు (సెప్టెంబర్ 13) సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారనీ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాని కలవబోతున్నారని సమాచారం. జగన్ ఢిల్లీలో రెండు రోజులు ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జమిలి ఎన్నికలపై కేంద్రంతో చర్చిస్తారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనను పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ గురించేనా? పోలవరం లాంటి కీలక ప్రాజెక్టులకు నిధులు రాబట్టడం, పార్లమెంటు సమావేశాలు, జమిలి ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరపడంపైనే జగన్ పర్యటన సాగుతుందని అధికారిక వర్గాలు చెబుతుండగా.. అసలు కథ వేరే ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు అరెస్ట్‌పైనే ప్రధానంగా భేటీ ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏపీలో బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేస్తాయని అంతా భావిస్తున్నారు. ఇటివలి కేంద్ర పెద్దలతో చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జేపీ నడ్డాతో కూడా మాట్లాడారు. అయితే తర్వాత రాజకీయ పరిణామాలు నాటకీయంగా మారుతూ వచ్చాయి. స్కిల్ స్కామ్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. మరోవైపు ఐటీశాఖ నోటిసులు కూడా అందాయి. ఇటు లండన్ టూర్ ముగించుకున్న జగన్ వచ్చిరావడంతోనే బిజీ ఐపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని అడిగి తెలుసుకున్నారు. అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కూడా జగన్‌ను కలిసి మొత్తం కేసు వివరాలు వివరించారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఎలాంటి స్పందన వ్యక్తమౌతుందో ఆరా తీశారు. అదే సమయంలో పార్టీ నేతలకు ఎలా వ్యవహరించాలనే విషయంపై కీలక సూచనలు జారీ చేశారు. ఇక వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం..జగన్ ఢిల్లీ వెళ్లనుండడం ఊహాగానాలకు ఆజ్యం పోస్తోంది. ALSO READ: ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు? పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వం..! #chandrababu-arrest #ap-assembly-sessions #cm-jagan-delhi-tour #andhra-pradesh-assembly-sessions-2023 #jagan-delhi-tour #andhra-pradesh-assembly-sessions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి