AP Police: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు పట్టుబడ్డారు ఇద్దరు ఆంధ్రా పోలీసులు. కాకినాడ లోని 3rd బెటాలియన్ APSP చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ 22 కేజీల గంజాయిను వాహనంలో తీసుకెళ్తుండగా అడ్డంగా దొరికిపోయారు.

New Update
AP Police: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు

AP Police: క్రైంను అరికాట్టాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ సైబరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు పట్టుబడ్డారు ఇద్దరు ఆంధ్రా పోలీసులు. బచుపల్లిలో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న SOT బాలానగర్ పోలీసులు అనుమానంతో AP 39 QH 1763 MARUTHI ECO వాహనాన్ని పట్టుకుని పరిశీలించారు.

Also Read: భద్రాచలంలో అమానుష ఘటన.. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు సృష్టించి ఏం చేశారంటే?

22 కేజీల గంజాయిను 11 పాకెట్స్ లో తరలిస్తున్నట్లు గుర్తించారు. దాని విలువ సుమారు 8 లక్షలు. వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా అది విని పోలీసులు షాక్ అయ్యారు. కాకినాడ లోని 3rd బెటాలియన్ APSP చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ గంజాయి స్మగ్లింగ్ చేసినట్లు తేలింది. పెద్ద మొత్తం లో డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో ఆరోగ్యం బాగాలేదు అనే సాకు చెప్పి మరి సెలవు తీసుకుని గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబట్టారు. బాచుపల్లీ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు