/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-21T170701.514-jpg.webp)
Anchor Sreemukhi: నటుడు పార్వతీశం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కేరింత సినిమాలో నూకరాజు పాత్రలో మెప్పించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి', 'గమ్మత్తు' ఇలా పలు సినిమాల్లో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Also Read: Vishwambhara: విశ్వంభర సెట్స్ నుంచి త్రిష పోస్ట్.. వైరలవుతున్న ఫొటో
మార్కెట్ మహాలక్ష్మి
పార్వతీశం నటించిన లేటెస్ట్ చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వీ ఎస్ ముఖేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రణికాన్వికా ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అవుతుంది. బీ2పీ స్థూడియోస్ బ్యానర్ పై అఖిలేష్ కలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మార్కెట్ మహాలక్ష్మి ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్.
హీరో పార్వతీశం చెంప పై కొట్టిన శ్రీముఖి
అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూ లో హీరో చెంప చెంపపగలగొట్టింది యాంకర్ శ్రీముఖి. అసలు విషయం ఏంటంటే.. ఇంటర్వ్యూ కు హోస్ట్ గా వ్యవహరించిన శ్రీముఖి హీరోతో కలిసి సినిమాలోని ఓ సీన్ చేస్తుంది. ఈ సీన్ లో హీరో వచ్చి హీరోయిన్ కు ఐ లవ్ యు అని చెప్తాడు. దీంతో హీరోయిన్ అతడి చెంప పగలగొట్టి.. "మార్కెట్ మహాలక్ష్మి మజాక్ లాడితే మంచిగుండదు" అని డైలాగ్ చెప్తుంది. ఇలా శ్రీముఖి కూడా ఈ సీన్ చేసిన సమయంలో హీరో పార్వతీశం చెంప పై కొట్టింది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చేశారు. కాగా.. ప్రమోషన్స్ లో భాగంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. మహాలక్ష్మి పేరు ఉన్న 200 మందికి ఫ్రీ టికెట్స్ ఇస్తామని అనౌన్స్ చేశారు. ఇప్పటికే రిలీజైన 'మార్కెట్ మహాలక్ష్మి' ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Why did Anchor #Sreemukhi slap Hero #Paravateesam? Promo out now! Don’t miss the full interview tomorrow!
మార్కెట్ మహాలక్ష్మి మజాక్ లాడితే మంచిగుండదు!! 🔥#MM #MarketMahalakshmi @VSMukkhesh31 @Akhileshkalaru @parvateesam_u #Praneekaanvikaa #B2PStudios @vickyvenki1 pic.twitter.com/jOIp954dAo
— Mukesh G (@MukeshG39549544) March 21, 2024
Also Read: Pushpa 2: శ్రీవల్లి ఏంటీ ఇలా ఉంది .. పుష్ప 2 నుంచి లీకైన రష్మిక లుక్..!