Anchor Shiva: ప్రశాంత్ అసలు రూపం ఇదే.. యాంకర్ శివ ఇన్స్టాగ్రామ్ పోస్ట్..! యాంకర్ శివ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రవర్తన పై తన సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసమని తన ఊరికి వెళితే.. అక్కడ 8 గంటల పాటు వేయిట్ చేయించి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వనని దురుసుగా ప్రవర్తించాడని తెలిపాడు. By Archana 20 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Anchor Shiva: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాల్ హాట్ టాపిక్ గా మారాడు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అభిమానం అనే పేరుతో అన్నపూర్ణ స్థూడియో ముందు రచ్చ చేశారు. బస్సుల పై దాడి చేయడం, కంటెస్టెంట్స్ కార్ల పై రాళ్లు విసురుతూ వీరంగం సృష్టించారు. దీనిని సుమోటోగా స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్, అతని అభిమానుల పై కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా పల్లవి ప్రశాంత్ ప్రవర్తన మరో చర్చకు దారి తీసింది.తాజాగా బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ యాంకర్ శివ పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం ప్రశాంత్ ఊరికి వెళ్లగా.. అక్కడ ప్రశాంత్ ప్రవర్తించిన తీరు బాగాలేదని యాంకర్ శివ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రశాంత్ ప్రవర్తన పై తన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు యాంకర్ శివ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఏం పోస్ట్ చేశాడు అనే వివరాల్లోకి వెళితే.. ఇంటర్వ్యూ కోసం అడగగా 18 గంటలు వెయిట్ చేయించి.. ఆ తర్వాత తన ఊరికి రా ఇస్తానని చెప్పాడు. చెప్పినట్లుగానే ఊరికి వెళ్ళాక.. అక్కడ ఇంటి ముందు 8 గంటల పాటు కూర్చోబెట్టి.. చివరికి ఇంటర్వ్యూ ఇవ్వడం కుదరదని దురుసుగా ప్రవర్తించాడు. ఇక్కడ నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం సమస్య కాదు.. చెప్పే విధానం బాగాలేదు. దీని పై ప్రూఫ్స్ తో సహా ఒక వీడియో చేస్తానని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా యాంకర్ శివ తన యూట్యూబ్ ఛానెల్ లో దీనికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేసినట్లు తెలిపాడు. View this post on Instagram A post shared by 𝘽𝙚𝙠𝙖𝙖𝙧 𝙏𝙧𝙤𝙡𝙡𝙨 (@bekaar_trolls) Also Read: Bigg Boss Amardeep: మా అమ్మ, భార్యకు ఏదైనా జరిగి ఉంటే.. అమర్ దీప్ ఎమోషనల్ వీడియో..! #bigg-boss-pallavi-prashanth #anchor-shiva-comments-on-pallavi-prashanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి