Anasuya Bharadwaj: 'ఇంకొకసారి నా జోలికి రావద్దు'..అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్.!

'ఇంకొకసారి నా జోలికి రావద్దు. నెక్ట్స్ ఇయర్ కూడా ఇలాగే రిపీట్ చేస్తే దూల తీర్చి దూపమేస్తాను' అంటూ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా హేటర్స్ కోసం ఒక వీడియోను పోస్ట్ చేసింది. కానీ, క్యాప్షన్ మాత్రం సీరియస్ కాదు, జోక్ చేస్తున్నా అని పెట్టింది.

New Update
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జబర్దస్త్’ (Jabardasth) కామెడీ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. పలు సినిమాలో మెరిసి తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. అప్పుడప్పుడు ట్రోలర్స్‌కు కూడా గురవుతువుంటుంది. అనసూయ కూడా ఏ మాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ పంచులు వేస్తూ ట్రోల్స్ చేసే వారికి గట్టిగా కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటుంది. ఇక న్యూ ఇయర్ సందర్భంగా తన హేటర్స్ అందరికీ డెడికేట్ చేస్తూ ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Also Read: అత్తారింట్లో అడుగుపెట్టకముందే చేలరేగిపోతున్న అనామిక..కావ్య ఏం చేయనుంది.?

‘‘2023లో నా వల్ల ఎవరైతే ఇబ్బందిపడ్డారో.. నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎవరినైతే నేను బాధపెట్టానో మీ అందరికీ.. మంచిగయ్యింది. ఇంకొకసారి నా జోలికి రావద్దు. నెక్ట్స్ ఇయర్ కూడా ఇలాగే రిపీట్ చేస్తే దూల తీర్చి దూపమేస్తాను’’ అంటున్న వీడియోను షేర్ చేసింది. అయితే ఈ వీడియో చూస్తే.. తనను ట్రోల్స్ చేసే వారికి వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. కానీ,  అది జోక్ అంటూ క్యాప్షన్‌లో పెట్టింది. ‘‘నేను జోక్ చేస్తున్నా. సీరియస్ కాదు’’ అంటూ వీడియో కింద క్యాప్షన్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు